ENGLISH

అఖిల్‌, సాయిధరమ్‌ అదరగొట్టేశారు

31 March 2017-12:37 PM

అక్కినేని వారసుడు అఖిల్‌ ఓ పక్క, మెగా మేనల్లుడు మరో పక్క డాన్సులతో అదరగొట్టేశారు. ఎక్కడనుకుంటున్నారా? ఐఫా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌ అంతకన్నా మించి, ఇద్దరూ మంచి డాన్సర్లే. అందుకే స్టేజ్‌ అదిరిపోయేలా స్టెప్పులేసి అలరించారు. ఐఫా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో ఈ సందడి వాతావరణం నెలకొంది. అలా కలర్‌ ఫుల్‌ డ్రస్సులతో ఈ ఇద్దరూ స్టేజ్‌ పైకెక్కి డాన్సులు చేస్తే ఎలా ఉంటుంది. మాంచి కిక్కెక్కేస్తది. అదే జరిగిందిక్కడ. చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలోని అమ్మడూ కుమ్ముడూ.. పాటకి కుమ్మేసేలా స్టెప్పులేసి స్టేజ్‌ని అదరగొట్టేశారు. ఈ అవార్డు ఫంక్షన్‌లో ఈ యంగ్‌ హీరోస్‌ డాన్సులు స్పెషల్‌ అట్రాక్షన్‌ అయిపోయాయి. నాగార్జున, చిరంజీవి మంచి ఫ్రెండ్స్‌. అలాగే అఖిల్‌, సాయిధరమ్‌ తేజ్‌ కూడా అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం ఉన్నోళ్లు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు స్టేజ్‌ పంచుకున్నారు. త్వరలో స్క్రీన్‌ పంచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ 'జవాన్‌' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే 'విన్నర్‌'తో మంచి హిట్‌ కొట్టాడు. ఇక అఖిల్‌ తన రెండో సినిమాకి ప్రిపేర్‌ అవుతున్నాడు. విక్రమ్‌.కె.కుమార్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

ALSO READ: గురు తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్