ENGLISH

గ్లామ్‌ షాట్‌: అమలా అందం అదిరేలా!

15 April 2017-12:44 PM

అందాల భామ అమలాపాల్‌ పెళ్ళయ్యాక, ఆ పెళ్ళిని పెటాకులు చేసుకున్నాక గ్లామర్‌ డోస్‌ పెంచేసింది. కొత్త ఇన్నింగ్స్‌లో గ్లామరస్‌గా సత్తా చాటేసుకోవాలన్న ఆరాటం ఆమెలో ఎక్కువైపోయినట్టుంది. కన్నడ, తమిళ, మలయాళ సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకున్న ఈ బ్యూటీని టాలీవుడ్‌ మాత్రం పట్టించుకోవట్లేదు. అదలా ఉంచితే, గుడ్‌ ఫ్రైడే సందర్భంగా, అలాగే తమిళ సంవత్సరాది సందర్భంగా సూపర్‌ గ్లామరస్‌ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే అమలాపాల్‌ అందం అదిరేలా ఉందీ కాస్ట్యూమ్‌లో. నేచురల్‌ బ్యూటీ అయిన అమలాపాల్‌, తెలుగులో 'బెజవాడ', 'నాయక్‌' తదితర సినిమాల్లో నటించిన సంగతి తెలిసినదే కదా.

ALSO READ: Amala Paul Hot Gallery