ENGLISH

'బాహుబలి ది కన్‌క్లూజన్‌'.. 1500 కోట్లు

19 May 2017-15:09 PM

1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రం 'బాహుబలి ది కన్‌క్లూజన్‌'. ఇప్పుడు ఈ రికార్డును కూడా వెనక్కి నెట్టేసి 1500 కోట్ల వసూళ్లను సాధించింది. తన రికార్డును తానే బ్రేక్‌ చేసింది ఈ సినిమా. ఇంత హై రేంజ్‌లో వసూళ్లు సాధించిన తొలి ఇండియన్‌ చిత్రంగా బాహుబలి చరిత్రలో నిలిచిపోతుంది. చిత్ర నిర్మాతలే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. సో ఇది అఫీషియల్‌ డిక్లరేషనే. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అత్యధిక వసూళ్లు సాధించింది 'బాహుబలి సినిమా'. ఇక్కడ ఓ స్పెషాలిటీ కూడా ఉంది. కన్నడలో డబ్బింగ్‌ వీలు పడక, డైరెక్టుగా తెలుగులోనే విడుదల చేశారు. అయినా కానీ అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా కర్ణాటకలో రికార్డు నమోదు చేసింది. ఇక ఓవర్సీస్‌, బాలీవుడ్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండి ఎక్కడైనా 'బాహుబలి'దే రికార్డు అన్నట్లుగా ఈ సినిమా దూసుకెళ్లిపోయింది. ఇంకా రన్నింగ్‌లోనే ఉంది. 1000 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా బాహుబలి ప్రబాస్‌ ఉన్న పోస్టర్‌ విడుదల చేయగా, తాజాగా దేవసేన, శివగామి అంటూ అనుష్క, రమ్మకృష్ణ నువ్వా నేనా అంటూ ఉన్నట్లుగా ఉన్న పోస్టర్‌ని విడుదల చేసి, 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' 1500 కోట్ల క్లబ్‌లో చేరింది అని ప్రకటించి, ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఈ పోస్టర్‌ చూస్తుంటే ఆల్రెడీ సినిమా చూసిన వాళ్లకి మళ్లీ సినిమా చూడాలనే ఆశక్తి పుట్టిస్తోంది. అదే బాహుబలి మేనియా అంటే. 

 

ALSO READ: 'సంఘమిత్ర' ప్రిన్సెస్‌ అదుర్స్‌