ENGLISH

చెన్నైలో మొదలు కాని బాహుబలి 2!

28 April 2017-10:33 AM

ప్రపంచమంతటా బాహుబలి 2 మేనియాతో అందరు ఊగిపోతుంటే, తమిళనాట మాత్రం బాహుబలి 2 చిత్రం స్క్రీనింగ్ ఇంకా మొదలేకాలేదు.

అందుతున్నతాజా సమాచారం ప్రకారం, బాహుబలి 2 తమిళ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్లకి ధియేటర్ల యజమానులకి మధ్య తలెత్తిన వివాదాల కారణంగా చిత్ర ప్రదర్శనలు మొదలుకాలేదు. ఇప్పటికున్న సమాచారం ప్రకారం, ఉదయం 11గంటల తరువాతనే థియేటర్ల లో తెలుగు & తమిళ వెర్షన్ల ప్రదర్శన ఉంటుంది అని తెలుస్తుంది.

ఈ పరిణామంతో చెన్నైలోని తెలుగు ప్రేక్షకులు మాత్రం తెల్లవారుజామున షోలు క్యాన్సిల్ అవ్వడంతో తీవ్ర నిరాశ చెందినట్టు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 ఉదయించినా తమిళనాట మాత్రం ఇంకా సమయం పట్టేలా ఉంది.

 

ALSO READ: బాహుబలి 2 తెలుగు రివ్యూ & రేటింగ్స్