ENGLISH

బాహుబలి - ఏనుగు తొండంపైకెక్కి!

24 February 2017-17:58 PM

రాజమౌళి అద్భుత తెర సృష్టి 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు శివరాత్రి సందర్భంగా 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' నుండి ఓ స్టిల్‌ని విడుదల చేశారు. సాహోరే బాహుబలి అన్నట్టుగా అద్భుతమైన స్టిల్‌ని విడుదల చేసింది 'బాహుబలి' యూనిట్‌. మహాశివరాత్రి సందర్భంగా విడుదలయిన ఈ స్టిల్‌ని అందర్నీ ఎట్రాక్ట్‌ చేస్తోంది. 'సాహోరే బాహుబలి - మహా శివరాత్రి శుభాకాంక్షలు' అంటూ ఈ స్టిల్‌ని రాజమౌళి విడుదల చేశాడు ట్విట్టర్‌లో. ప్రభాస్‌ ఏనుగు తొండంపై ఓ కాలు, ఏనుగు కుంభస్థలంపై ఇంకో కాలు వేసి నిల్చున్న స్టిల్‌ ఇది. అత్యద్భుతంగా ఉంది. క్షణాల్లో ఈ స్టిల్‌ వైరల్‌గా మారింది. 'బాహుబలి' ది బిగినింగ్‌కి ఇది రెండో పార్ట్‌. 'బాహుబలి ది బిగినింగ్‌'తో తెలుగు సినిమా చరిత్రని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు డైరెక్టర్‌ రాజమౌళి. ఇప్పుడు సెకండ్‌ పార్ట్‌ 'బాహుబలి ది కంక్లూజన్‌'తో తన రికార్డుల్ని తానే తిరగరాయడానికి, తెలుగు సినిమా సత్తాని మరోస్సారి చాటడానికి చిత్ర యూనిట్‌ రెడీ అయ్యింది. ప్రబాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు ఈ సినిమాలో. రమ్యకృష్ణ, సత్యరాజ్‌ కీలకపాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకి సమాధానం దొరికే రోజు తొందర్లోనే వచ్చేస్తోంది. ఆల్‌ ది బెస్ట్‌ టు బాహుబలి. 

ALSO READ: యమన్ మూవీ రివ్యూ & రేటింగ్స్