ENGLISH

బాలయ్య పాటెందుకు పాడారంటే..?

12 May 2017-12:28 PM

బాలకృష్ణకి సంగీతం పట్ల మొదట్నుంచీ ఇంట్రెస్ట్‌ ఉంది. కానీ ఇంతవరకూ పాట పాడే సాహసం చేయలేదు. ఇప్పటి వరకూ చిరంజీవి మొదలుకొని, నాగార్జున, వెంకటేష్‌ వంటి సీనియర్‌ హీరోలంతా సింగింగ్‌లో తమ టాలెంట్‌ చూపించేశారు. యంగ్‌ హీరోల్లో చాలా మంది సాంగ్స్‌ని హమ్‌ చేసేశారు. కానీ బాలయ్యను ఎంత మంది అడిగినా ఇంతవరకూ పాడడానికి ఇష్టపడలేదు. కానీ ఈ సారి మాత్రం ఆయనే పాట పాడేందుకు స్వయంగా ముందుకొచ్చారట. తాజాగా బాలయ్య - పూరీ జగన్నాధ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య పాట పాడారు. ఈ పాట బాలయ్య పాడడం వెనకాల చాలా ఇంట్రెస్టింగ్‌ స్టోరీ ఉందట. అయితే అదేంటో బాలయ్యే చెబుతారట. కానీ ఇప్పుడు కాదంటున్నారు. ముందు ముందు తెలుస్తుందంటున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం బాలయ్య పాట ఎందుకు పాడారనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంచారు. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌లో బాలయ్య పాడిన పాట చాలా బాగుందంటోంది చిత్ర యూనిట్‌. బాలయ్యకు మ్యూజిక్‌ పట్ల ఉన్న ఆశక్తితోనే గతంలో ఓ సినీ ఫంక్షన్‌లో 'లెజెండ్‌' సినిమాలోని పాటను స్టేజ్‌పై హమ్‌ చేశారు. అప్పుడే అర్ధమయ్యింది బాలయ్య సింగింగ్‌ టాలెంట్‌ ఏంటో. పేజీల కొద్దీ అదిరిపోయే డైలాగుల్ని అలవోకగా చెప్పడమే కాదు బాలయ్యలో ఈ రకం కొత్త టాలెంట్‌ కూడా దాగుందని తెలిసింది. అయితే సినిమాల్లో పాడడానికి ఎందుకో ఇష్టపడలేదు. ఏది ఏమైనా బాలయ్య ఎట్టకేలకు తన గొంతు సవరించుకున్నారు. బాలయ్య అభిమానులకు దిల్‌ ఖుషీ అయ్యే విషయమే కదా ఇది. 

 

ALSO READ: వెంకటాపురం తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్