ENGLISH

అలాంటి వాటికి ‘No’ అనేసిన కేథరిన్

07 July 2017-12:07 PM

యు ఆర్ మై ఏంఎల్ఏ అనే గీతంలో లవ్లీ ఏంజెల్ గా పేరుతెచ్చుకున్న కేథరిన్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్.

అయితే ఆమె ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే- ఇక పై స్పెషల్ సాంగ్స్ లో నర్తించకూడదు అనే నిర్ణయం తీసుకుంది, అలాగే మొన్న తనకి తమిళ ఇండస్ట్రీ నుండి వచ్చిన స్పెషల్ సాంగ్ ఆఫర్ ని కూడా తిరస్కరించినట్టు తెలిపింది.

కాని నిన్న మొన్ననే బెల్లంకొండ-బోయపాటి చిత్రమైన జయ జానకి నాయక చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడానికి కేథరిన్ ఒప్పుకున్నట్టు తెలిసింది. మరి ఈ నిర్ణయం తరువాత జయ జానకి నాయకలో స్పెషల్ సాంగ్ చేస్తుందో లేదో చూడాలి.

 

ALSO READ: చైతు-సమంతాల పెళ్లి ముచ్చట్లు!