ENGLISH

'పద్మావతి' పిచ్చెక్కించేస్తోంది

21 September 2017-16:06 PM

గతంలో సంజయ్‌ లీలా భన్సాలీ - దీపికా పదుకొనె కాంబినేషన్‌లో తెరకెక్కిన 'బాజీరావ్‌ మస్తానీ' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. ప్రియాంకా చోప్రా, రణ్‌వీర్‌ సింగ్‌ ఇతర ముఖ్య తారాగణంగా నటించారు ఆ సినిమాలో. ఆ సినిమా సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. అదే కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మరో భారీ బడ్జెట్‌ మూవీ 'పద్మావతి'. మేవార్‌ సంస్థానం రాజు రానా రావల్‌ రతన్‌ సింగ్‌. ఆయన భార్య రాని పద్మినీ. ఆ పాత్రలోనే ఇప్పుడు దీపికా పదుకొనె నటిస్తోంది. రాజు పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాత్రలో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనె పాత్ర చాలా కీలకం. ఆమె క్యారెక్టర్‌ని డైరెక్టర్‌ డిజైన్‌ చేసిన విధానానికి అంతా షాక్‌ అవుతారు. లేటెస్టుగా ఈ సినిమాలో దీపిక ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఈ లుక్‌కి ఫిదా అయిపోతున్నారంతా. దీపిక యాక్టింగ్‌ టాలెంట్‌ గురించి అందరికీ తెలిసిందే. మోడ్రన్‌ గెటప్‌ అయినా, ట్రెడిషనల్‌ గెటప్‌ అయినా సరే ఆమె కటౌట్‌కి ఇట్టే మ్యాచ్‌ అయిపోతుంది. ఇక క్యారెక్టర్‌కి తగ్గట్లుగా ఆమె పండించే హావభావాలని వర్ణించడం మాటల్లో చెప్పలేని విషయం. అలాంటిది ఈ 'పద్మావతి' లుక్‌లో దీపిక అందం, ఆహార్యం, రాణిగా రాజసం చూడ్డానికి రెండు కళ్లూ చాలడం లేదు. ఆమె అభిమానులు ఈ గెటప్‌లో చూసి దీపిక నువ్వు అందుకే అంత స్పెషల్‌ అనుకోకుండా ఉండలేకపోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. మరోపక్క బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ దీపిక కాలు మోపింది. అక్కడ కూడా తన సత్తా చాటేస్తోంది.

ALSO READ: జై లవకుశ మూవీ రివ్యూ & రేటింగ్స్