ENGLISH

ఫ్లాప్‌ అన్నారు..కానీ కొల్లగొట్టాడు

15 September 2017-12:21 PM

'వివేగం' సినిమా అజిత్‌ హీరోగా ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో 'వివేకం' పేరుతో రిలీజైంది ఈ సినిమా. మొదట్లో ఈ సినిమాకి నెగిటివ్‌ టాక్‌ వచ్చింది. విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదలయ్యాక సినిమా బాగాలేదనీ తేల్చేశారు. అయితే ఇప్పుడు ఇది వరల్డ్‌ రికార్డు సాధించింది. ఈ సినిమా టీజర్‌ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్‌ మూవీ 'స్టార్‌ వార్స్‌' వ్యూస్‌ని దాటేసి, మొదటి స్థానంలో నిలిచింది. టీజర్‌ చూస్తే హాలీవుడ్‌ రేంజ్‌లో టెక్నికల్‌ వేల్యూస్‌ అనిపించాయి. ఆ రకంగా టీజర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాడు అజిత్‌. అయితే తెలుగులో అంత బాగా ఆకట్టుకోలేకపోయింది. కానీ వసూళ్లు బాగానే సాధించింది. 150 కోట్ల వసూళ్ల గ్రాస్‌ని సాధించింది 'వివేగం' అని ట్రేడ్‌ పండితులు లెక్కలు తేల్చారు. శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కాజల్‌ అగర్వాల్‌, అక్షరా హాసన్‌ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించింది. అలాగే ఓవర్సీస్‌లో కూడా దుమ్ము లేపేసింది. అజిత్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌, యాక్షన్‌ సీన్స్‌ ఈ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి. మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా కానీ లేట్‌గా అయినా టోటల్‌గా సినిమా అయితే హిట్‌ అని తేలింది. శివ దర్శకత్వంలోనే అజిత్‌ మరో సినిమా చేయనున్నాడనీ సమాచారమ్‌.

ALSO READ: స్పైడర్‌' లవ్‌ స్టోరీ క్యూట్‌ అండ్‌ హాట్‌