ENGLISH

దేవి శ్రీ ప్రసాద్ మూవీ రివ్యూ & రేటింగ్స్

24 November 2017-14:33 PM

తారాగణం: పూజా రామచంద్రన్‌, మనోజ్‌ నందం, భూపాల్‌, ధన్‌రాజ్‌, పోసాని కృష్ణమురళి, వేణు టిల్లు తదితరులు
సంగీతం: కమ్రాన్‌
సినిమాటోగ్రఫీ: ఫణీంద్ర శర్మ
దర్శకత్వం: శ్రీ కిషోర్‌
నిర్మాతలు: డి.వెంకటేష్‌, ఆర్‌.వి. రాజు, ఆక్రోష్‌
నిర్మాణం: యశ్వంత్‌ మూవీస్‌, ఆర్‌ఓ క్రియేషన్స్‌ 

యావరేజ్ యూజర్ రేటింగ్స్: 2.5/5

మృతదేహంతో శృంగారమేంటి? అనే జుగుప్సాకరమైన ఫీలింగ్‌ని టీజర్‌తోనే కల్పించడం ఆత్మహత్యా శదృశ్యమే. కానీ సినిమాలో బలమైన కంటెంట్‌ ఉందని మేకర్స్‌ చెబుతూ వచ్చారు. ఎంతోమంది కథానాయికలకు కథ చెబితే ఒప్పుకోలేదట. పూజా రామచంద్రన్‌ ఎలా ఒప్పుకుంది? తెలుసుకోవడానికి కథలోకి వెళదాం.

కథా కమామిషు..  

దేవి (భూపాల్‌) ఆటో నడుపుతుంటాడు, శ్రీ (ధన్‌రాజ్‌) హాస్పిటల్‌లో వార్డు బాయ్‌. ప్రసాద్‌ (మనోజ్‌ నందం) టీ కొట్టుతో జీవనం సాగిస్తాడు. ముగ్గురూ స్నేహితులు. దేవి కొంచెం నెగెటివ్‌ షేడ్స్‌తో ఉంటాడు. ఈ ముగ్గురికీ హీరోయిన్‌ లీల (పూజా రామచంద్రన్‌) అంటే చాలా ఇష్టం. షూటింగ్‌ జరిగే ప్రాంతానికి వెళ్ళి ఆమెను చూడాలనుకుంటారు, కానీ వారి కోరిక పూర్తిగా ఫలించదు. అనుకోకుండా లీల యాక్సిడెంట్‌లో చనిపోతుంది. ఆమె మృతదేహం శ్రీ పనిచేసే ఆసుపత్రికి తీసుకొస్తారు. ఆమెను చూసేందుకు ముగ్గురు స్నేహితులూ వెళతారు. లీలని మార్చురీలో చూసి, ఆమెతో సెక్స్‌ చేయాలనుకుంటాడు దేవి. శ్రీ, ప్రసాద్‌ వద్దంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? లీల ఎలా చనిపోయింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే చూడాలి.

నటీనటులెలా చేశారు..

దేవి, శ్రీ, ప్రసాద్‌ పాత్రల్లో నటించిన భూపాల్‌, ధన్‌రాజ్‌, మనోజ్‌ నందం ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ఒక్కొక్కరిదీ ఒక్కో రకం మనస్తత్వం. ఏ పాత్రకి ఆ పాత్రే అన్నట్లు మూడూ విభిన్నమైన పాత్రలు. ఎవరి పాత్రలకు వారు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. 

పూజా రామచంద్రన్‌ నేచురల్‌ గ్లామర్‌తో ఆకట్టుకుంది. సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందిగానీ, నటన విషయంలో ఆమెకు పెద్దగా స్కోప్‌ లేకుండా పోయింది. 

మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర ఓకే అనిపిస్తారు.

విశ్లేషణ..

థ్రిల్లింగ్‌ సినిమాలకి లాజిక్‌ తోడైతే ఇంకాస్త గ్రిప్పింగ్‌గా అనిపిస్తుంది. ప్రధాన పాత్రధారి చుట్టూ కథ నడుస్తున్నప్పుడు, ఆ పాత్ర నటనకి ప్రాధాన్య ఉండేలా తీర్చిదిద్దాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. చనిపోయిన యువతితో శృంగారం అనే కాన్సెప్ట్‌ ఓ సెక్షన్‌ ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించడంలో సఫలమవుతుంది. 

అదే సమయంలో చాలామందిని అటువైపు చూడకుండా కూడా చేస్తుందనడం నిస్సందేహం. కొత్తదనం కోసం ప్రయత్నించిన దర్శకుడ్ని అభినందించకుండా ఉండలేం. ఇంకాస్త లాజికల్‌గా, ఇంకాస్త గ్రిప్పింగ్‌గా సినిమా ఉండి ఉంటే ఇంకా బెటర్‌ రిజల్ట్‌ వచ్చి ఉండేది. ఓవరాల్‌గా సినిమా ఓకే అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం పనితీరు..

సినిమా నిడివి తక్కువ కావడంతో ఉన్నంతలో టెక్నికల్‌ వింగ్‌ మంచి ఔట్‌ పుట్‌ ఇచ్చేందుకు ఆస్కారం ఏర్పడింది. ఎడిటింగ్‌ దగ్గర్నుంచి కథనం వరకూ అన్నీ ఓకే అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.

మ్యూజిక్‌ ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగానే అనిపిస్తుంది. మాటలు బాగానే ఉన్నాయి.

ఫైనల్‌ వర్డ్‌.. 'దేవి శ్రీ ప్రసాద్‌' ఓకే అన్పించే థ్రిల్లర్‌

 

ALSO READ: నారా రోహిత్ బాలకృష్ణుడు రివ్యూ రేటింగ్స్