ENGLISH

'పైసావసూల్‌' థియేటర్ల వద్ద హల్‌చల్‌

01 September 2017-12:10 PM

తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న దసరా పండగ రానే వచ్చేసింది. అదేంటి దసరా ఇంకా చాలా రోజులుంది కదా అనుకుంటున్నారా? అవును దసరా అయితే చాలా రోజులే ఉంది కానీ, ప్రేక్షకులకు మాత్రం పండగ వచ్చేసినట్లే. ఎందుంటే దసరా బుల్లోడు బాలయ్య సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరీ జగన్నాధ్‌ కాంబినేషన్‌లో తొలి సారిగా బాలయ్య నటిస్తోన్న చిత్రమిది. భారీ అంచనాలతో తెరకెక్కింది. ధియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు విపరీతమైన సందడి చేస్తున్నారు. సినిమా చాలా బాగుందని అభిమానుల నుండి వస్తోన్న టాక్‌. 'పైసా వసూల్‌' అనే టైటిల్‌తో పూరీ ముందే ఈ సినిమా చూసే ప్రేక్షకులకి ఖచ్చితంగా పైసా వసూల్‌ అనే నమ్మకాన్ని కల్గించేశాడు. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బాలయ్య విసృతంగా పాల్గొన్నారు. కొత్త రకం బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటున్నారు బాలయ్య ఈ సినిమాలో. డైలాగ్స్‌, టీజర్స్‌, ట్రైలర్స్‌ అన్నీ చాలా కొత్తగా మాస్‌ ఆడియన్స్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేసేలా డిజైన్‌ చేశారు. శ్రియ, ముస్కాన్‌ సేథి, కైరా దత్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా బాగా జరిగింది ఈ సినిమాకి. 'పైసా వసూల్‌' విడుదలవుతోన్న ధియేటర్స్‌ అభిమానుల కోలాహలంతో సందడిగా మారాయి. మరి బాలయ్య బాక్సాఫీస్‌ వద్ద ఎలా పైసా వసూల్‌ చేస్తాడో చూడాలిక.

ALSO READ: పైసా వ‌సూల్‌ రివ్యూ & రేటింగ్స్