ENGLISH

రావణాసుర ప్రభంజనం - దటీజ్‌ ఎన్టీఆర్‌

07 July 2017-18:11 PM

'జై లవకుశ' సినిమా ఫస్ట్‌లుక్‌లో రావణాసురుని ఫోటో ఎందుకు చూపించారో ఇప్పుడు అర్ధమైంది ఆడియన్స్‌కి. అప్పుడే అంతా అనుకున్నారు ఎన్టీఆర్‌ రావణాసురుని పాత్రలో కనిపించనున్నాడనీ, కానీ బలంగా ఊహించలేదు. అయితే టీజర్‌ వచ్చినాక ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయిపోయారు. కేవలం టీజర్‌ ఫ్యాన్స్‌కే కాదు, అందరూ మెచ్చారు. ఆ రేంజ్‌లో ఎన్టీఆర్‌ పెర్ఫామెన్స్‌ ఉండడమే ఇందుకు కారణం. టీజర్‌ వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు రెట్టిపయ్యాయి. ఎన్టీఆర్‌ రేంజ్‌ బాగా పెరిగిపోయింది ఈ టీజర్‌తో. ఇదేదో 100 కోట్లు, 150 కోట్ల స్థాయి సినిమా కాదు, అంతకు మించిన స్థాయిలో వసూళ్లు సాధించేలా ఉంది. ఇంతవరకూ ఎన్టీఆర్‌ వంద కోట్లు మార్కెట్‌ని దాటలేదు. ఈ సినిమా ఆ లోటు తీర్చేలానే ఉంది. టీజర్‌లో ఎన్టీఆర్‌ పెర్ఫామెన్స్‌కి టాలీవుడే కాదు, బాలీవుడ్‌ కోలీవుడ్‌ కూడా ఫిదా అయిపోతోంది. టీజర్‌ చివర్లో వచ్చే నవ్వు, నవ్వు కాదది వికటాట్టహాసం. అది చూస్తే చాలు నట విశ్వరూపానికి వారసత్వం ఇదే అని తేలిపోతోంది. టీజర్‌లోనే ఇంత పెర్ఫామ్‌ చేసేసిన ఎన్టీఆర్‌ ఇక సినిమాలో చెలరేగిపోతాడనీ, నెగిటివ్‌ రోల్‌లో ఎన్టీఆర్‌ తనకు తానే సాటి అని నిరూపించేసుకున్నాడనీ, నందమూరి ఫ్యాన్స్‌ ఫిక్సయిపోయారు. సోషల్‌ మీడియాలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ టీజర్‌కి వ్యూస్‌ వస్తున్నాయి. నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ ఈ సినిమాకి దర్శకుడు. 

 

ALSO READ: రెండు రెళ్లు ఆరు తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్