ENGLISH

'టచ్ చేసి చూడు' చిత్రం పై 'కత్తి మహేష్' షాకింగ్ రివ్యూ

02 February 2018-15:37 PM

మాస్ మహరాజ్ రవితేజ తాజా చిత్రం టచ్ చేసి చూడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. అయితే ఈ చిత్రం చూసిన ప్రముఖ క్రిటిక్ కత్తి మహేష్, సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రం పైన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఈ సినిమా ఒక అర్ధం పర్ధంలేని యాక్షన్ డ్రామా అని, కథలో పట్టులేదని అలాగే స్టార్ హీరో అయిన రవితేజని కూడా డైరెక్టర్ ఈ చిత్రంలో సరిగా వాడుకోలేకపోయాడు అని చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఈ ఈ చిత్రాన్ని ఎవరు టచ్ చేయకపోతేనే మంచిది అని తేల్చేశాడు.

ఇక ఈ సినిమాకి సంబంధించి టాక్ కూడా నెగటివ్ గానే వస్తుండడంతో కత్తి మహేష్ ఈ సినిమాకి సంబంధించి చేసిన వ్యాఖ్యలకి ప్రాధాన్యం లభిస్తుంది. దీంతో రవితేజ గ్యాప్ తీసుకొని చేసిన రెండవ చిత్రం టచ్ చేసి చూడు ప్రేక్షకులని నిరాశపరిచేలా ఉంది అని అర్ధమవుతున్నది.

ఇక ఈ టచ్ చేసి చూడు చిత్రాన్ని ఎవరూ టచ్ చేయక పోతేనే బెటరేమో..

ALSO READ: ఛ‌లో మూవీ రివ్యూ & రేటింగ్స్