ENGLISH

నేల టిక్కెట్టు మూవీ రివ్యూ & రేటింగ్

25 May 2018-13:12 PM

తారాగణం: రవితేజ, మాళవిక శర్మ, జగపతి బాబు తదితరులు
నిర్మాణ సంస్థ: SRT ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
ఛాయాగ్రహణం: ముఖేష్
ఎడిటర్: చోటా కే ప్రసాద్
కథనం: సత్యానంద్
నిర్మాత: రామ్ తాళ్ళూరి
రచన-దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ 

రేటింగ్:2/5

కథ:

అనాధ అయిన రవితేజ, చిన్నప్పటి నుండి తన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడం వాళ్ళందరిని తన కుటుంబసభ్యులుగా అనుకుంటుంటాడు. అందులో భాగంగానే కొన్ని ఇబ్బందులు పడుతుంటాడు. ఇక మరోవైపు ఆదిత్య బాబు (జగపతి బాబు) మంత్రి పదవి కోసం సొంత తండ్రిని కూడా చంపడానికి వెనుకాడని వాడు. ఇక ఇటువంటి రెండు భిన్న వ్యక్తిత్వాలు ఎదురుపడితే ఏంటి అనేది ఈ చిత్ర కథ...

నటీనటుల పనితీరు:

రవితేజ: నేల టిక్కెట్టు అనే విచిత్రమైన పేరుతో ఈ చిత్రంలో ఓ అనాధగా కనిపిస్తాడు. ఇక ఎప్పటిలానే తన మార్కు ఎనర్జీని చూపిస్తూ సినిమా అంతా తానై నడిపిస్తాడు.

మాళవిక శర్మ: ఈ అమ్మడు గ్లామర్ పరంగా ఒకే అనిపించినా, నటన పరంగా ఇంకాస్త కృషి చేయాలి. అయితే ఈ చిత్రంలో ఆమెకి ఎక్కువ పాటలు తక్కువ సన్నివేశాలు ఉన్నాయి.

జగపతి బాబు: తెలుగు సినిమా రొటీన్ విలన్ పాత్రలో రొటీన్ గానే కనిపించాడు. వైవిధ్యం చూపించడానికి ఆస్కారం ఈ పాత్రలో లేకపోవడంతో ఆయన కూడా ఒక ఫ్లో లో నటించేశాడు.

మిగితా పాత్రల నిడివి, ప్రాధాన్యం రెండు తక్కువే...

విశ్లేషణ:

రెండు వరుస విజయాలతో మంచి రచయిత-దర్శకుడు అన్న పేరు తెచ్చుకున్న కళ్యాణ్ కృష్ణ, ఈ సినిమా తో ఒక పరాజయాన్ని మూట కట్టుకున్నాడు అనే చెప్పాలి. ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఉండడంతో కమర్షియల్ అంశాలన్నిటిని ఒకే కథలో కుక్కే ప్రయత్నం చేయగా అది అంత బాగా కుదరలేదు అని చెప్పొచ్చు.

కామెడీ సన్నివేశాల వరకు డైలాగ్స్ అక్కడక్కడ పేలినా మొత్తంగా మాత్రం అంతగా గుర్తుపెట్టుకునేందుకు ఏమి మిగలలేదు. చిత్రం మొదటి భాగం కొద్దిగా బాగున్నా, రెండవ భాగం వచ్చేసరికి మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షకి గురిచేసేలా ఉంది.

ట్విస్టులు కూడా పెద్దగా పేలకపోవడం, ఊహించిన సన్నివేశాలే వస్తుండడంతో సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగిలింది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా కథనాన్ని సరిగ్గా సిద్ధం చేయించుకోలేకపోయాడు అని అర్ధమవుతుంది.

సాంకేతిక వర్గం పనితీరు:

ఫిదా చిత్రంతో మంచి పాటలే కాకుండా గుర్తిండిపోయే పాటాలు ఇచ్చిన శక్తికాంత్ కార్తీక్, ఈ చిత్రంలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు అనే చెప్పాలి. ఒక్క పాట కూడా ఆకట్టుకోలేకపోయింది.

బలాలు:

+ రవితేజ

బలహీనతలు:

-  పాటలు
-  కథనం
-  ఊహించగలిగే ట్విస్టులు

ఆఖరి మాట:

నేల టిక్కెట్టు: “టిక్కెట్టు” తెగడం కష్టమే!!

రివ్యూ రాసింది సందీప్

 

ALSO READ: నేల టిక్కెట్టు చిత్రం రివ్యూ ఇంగ్లీష్ లో చదవండి