ENGLISH

నేనోరకం మూవీ తెలుగు రివ్యూ & రేటింగ్స్

15 March 2017-23:31 PM

తారాగణం: రామ్ శంకర్ , రేష్మి మీనన్, శరత్ కుమార్
బ్యానర్: విభా ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: మహిత్ నారాయణ్
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
నిర్మాత: దేపా శ్రీకాంత్
రచన-దర్శకత్వం: సుదర్శన్ సలేంద్ర

రామ్ శంకర్ కెరీర్ తొలినాళ్ళలో ఫరవాలేదనిపించాడు అయితే ఆ తర్వాత ఆ జోరును కంటిన్యూ చెయలేక ఇప్పుడున్న యంగ్ హీరొల రేసులో వెనుకబడ్డాడు. హీరోగా పరిచయమై దశాబ్దం పూర్తయ్యింది కానీ సాలిడ్ హిట్ ని మాత్రం దక్కించుకోలేకపోయాడు. తాజాగా సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో దేపా శ్రీకాంత్ నిర్మించిన '' నేనోరకం '' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రామ్ శంకర్ . సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్న ఈ  చిత్ర యూనిట్ రెండు రోజుల ముందుగానే ప్రివ్యూ షో ను క్రిటిక్స్ కు చూపారు. మరి ఈ సినిమాతో రాం శంకర్ తాను కొరుకున్న సాలిడ్ హిట్ అందుకున్నాడా? లేదా? అన్నది చూద్దాం.

* కథ విషయానికి వస్తే...

గౌతమ్ (రామ్ శంకర్ ) అనాధ.  ఫైనాన్స్ కంపెనీ లో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. సెన్సిటివ్ గా ఉంటూ మొక్కలను అమితంగా ఇష్టపడే స్వేచ్ఛ ( రేష్మి మీనన్)ని చూసి ప్రేమలో పడతాడు. స్వేచ్ఛతో పరిచయం చేసుకోవడానికి అబద్దాలు చెప్పి ఆమెకు దగ్గర అవుతాడు . అయితే గౌతమ్ చెప్పినవన్నీ అబద్దాలు అని స్వేచ్ఛ కు తెలియడంతో గౌతమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అనంతరం  గౌతమ్ కి తనపైన ఉన్నది నిజమైన ప్రేమే అని భావించిన స్వేచ్ఛ రెస్టారెంట్ లో కలుద్దామని చెబుతుంది. కట్ చేస్తే స్వేచ్ఛని రెస్టారెంట్ ముందు ఎవరో కిడ్నాప్ చేస్తారు. స్వేచ్ఛని కిడ్నాప్ చేసిందెవరు? గౌతమ్ తన ప్రేయసి ని కిడ్నాపర్ల చెర నుండి విడిపించాడా? చివరకు ఈ ఇద్దరి ప్రేమ ఫలించిందా? అన్నది తెలియాలంటే నేనోరకం సినిమా చూడాల్సిందే.

*ఎవ‌రెలా  న‌టించారంటే...

హీరో రామ్ శంకర్ చాలాకాలంగా  సక్సెస్ కోసం  ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాలో కాస్త భిన్నంగా అతనికి  పాత్ర లభించడంతో ఆ అవకాశాన్ని సద్వినియాగం చేసుకున్నాడు. ఫస్టాఫ్ లో లవర్ బాయ్ గా సెకండాఫ్ కు వచ్చేసరికి ప్రేయసి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే ప్రేమికుడిగా మంచి ఈజ్ ప్రదర్శించాడు.

హీరోయిన్ రేష్మి అందంగా ఉంది, అంతే అందంగా అభినయించింది.

ఇక చాలా సంవత్సారాల తర్వాత తమిళ హీరో శరత్ కుమార్ తెలుగులో ఓ మంచి పాత్రని చేశాడు. శరత్ ప్లాష్ బ్యాక్ ఎపిసొడ్  హార్ట్ టచింగ్ గా ఉండటం తో పాటు తనదైన కిల్లర్ అండ్ కన్నింగ్ లుక్స్, డైలాగ్స్ తో అదరగొట్టెశాడు.

అలాగే ఎమ్మెస్ నారాయణ (చనిపోయారు కాబట్టి)  పాత్రకు మరొకరి చేత డబ్బింగ్ చెప్పించారు కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు.

*టెక్నికల్ గా...
 
చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ఈ చిత్రానికి అందించిన సంగీతం ఆర్.ఆర్. ఓ హైలెట్ గా నిలిచింది . పాటలు ఫర్వాలేదు కానీ సినిమాకు కొన్ని చోట్ల బ్రేక్ లా అడ్డు తగిలాయి. అయితే రీ రికార్డింగ్ తో ఆ లోపాలని కొంత వరకు తగ్గించె ప్రయత్నం జరిగింది.  సిద్దార్ద్ ఛాయాగ్రహణం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. సిజి వర్క్ అంతగా బాలేదు. నిర్మాణ విలువలు ఓకె..

ఇక దర్శకుడు సుదర్శన్ సలేంద్ర విషయానికి వస్తే ....... బర్నింగ్ ఇష్యూ ని కథా వస్తువుగా ఎంచుకొని మొదటి విజయం సాధించాడు . అలాగే ఆ కథకి సరిపడే నటీనటులను ఎంచుకొని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో కధనాన్ని నడిపాడు. మొదటి భాగాన్ని పక్కన పెడితె  ఇంటర్వెల్ బ్యాంగ్ తో మొదలెట్టి  సెకండాఫ్ మరియు సినిమా క్లెమాక్స్ వరకు రేసీ స్క్రీన్ ప్లే  ఎక్కడా తగ్గకుండా చాలా బాగా హ్యాండిల్ చేసాడు. అయితే  ఫస్టాఫ్ మరికాస్త ఎడిట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.

*ప్ల‌స్ పాయింట్స్:

కాంటెపరరీ ఇష్యూ ని కథగా ఎంచుకొవటం..

శరత్ కుమార్ నటన

మహిత్ నారాయణ్ ఆర్.ఆర్

*మైన‌స్‌ పాయింట్స్:

రోటీన్ ఫస్టాఫ్

సి.జి. వర్క్

*ఫైనల్ వర్డిక్ట్:

ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై కథ అల్లి సుదర్శన్ సలేంద్ర మంచి అటెన్షన్ కొట్టేసాడు. బర్నింగ్ ఇష్యూ కావడంతో తప్పకుండా యూత్ కి మాత్రమే కాదు తల్లిదండ్రులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. మంచి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఈ వీకెండ్ లో చూడదగ్గ సినిమానే..

యూజర్ రేటింగ్: 3/5

రివ్యూ బై: శ్రీ