ENGLISH

గ్లామ్‌ షాట్‌: అందానికి 'కంచె' వేయగలమా?

07 July 2017-16:48 PM

పద్ధతిగా చీరల్లో కనిపించినా, హీటెక్కించేలా ట్రెండీ హాట్‌ డ్రెస్సుల్లో కనిపించినా ఆ హైటూ ఆ పర్సనాలిటీ మరింత ఎలివేట్‌ అవుతుంటుంది 'కంచె' ఫేం ప్రగ్యా జైస్వాల్‌ విషయంలో. తన తాజా చిత్రం 'నక్షత్రం'లో ఈ బ్యూటీ ఏకంగా బికినీలో కనిపించేయనుంది. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పటికే హల్‌చల్‌ చేసేస్తున్నాయి. ఇంకో వైపున ట్రెండీ హాట్‌ లుక్స్‌తో సినిమా ఫంక్షన్లలో ప్రగ్యా చేస్తోన్న సందడి అంతా ఇంతా కాదు. ఏదేమైనా ఈ బ్యూటీని చూస్తే 'అందానికి కంచె వేయగలమా?' అని అనిపిస్తుంటుంది. ఈ ఫొటోతో ఆ మాట నిజమని ఇంకోసారి నిరూపితమవుతుంది.

ALSO READ: Qlik Here For Pragya Jaiswal Latest Photos