ENGLISH

అమ్మ జ్ఞాపకాలు ఎప్పటికి నాతోనే ఉంటాయి- రాజీవ్ కనకాల

03 February 2018-14:45 PM

సీనియర్ నటుడు దేవదాస్ కనకాల సతీమణి, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మాతృమూర్తి లక్ష్మీదేవి శనివారం ఉదయం స్వర్గస్థులయ్యారు. ఈ రోజు స్వగృహంలో ఉండగా, అనూహ్యంగా గుండెపోటు రావడంతో కన్ను మూశారు. 

యాక్టింగ్ స్కూల్ ద్వారా అనేకమందికి నటనలో ఓనమాలు దిద్దించిన లక్ష్మీదేవి 'మాస్టారు కాపురం', 'మాయలోడు' తదితర చిత్రాల్లో నటిగా అద్భుతమైన పాత్రలు పోషించారు. ఆరు చిత్రాల్లో నటించారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో లక్ష్మీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రాజీవ్ కనకాల తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ - "అమ్మది సంపూర్ణమైన జీవితం. నట శిక్షకురాలిగా ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు. నటుడిగా, నటిగా చిత్రపరిశ్రమలో పేరు తెచ్చుకోవాలని ప్రయతించే ప్రతి ఒక్కరినీ తన కన్నబిడ్డలా చేరదీసింది. నిన్నటి (శుక్రవారం)వరకూ ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వర్తించింది" అన్నారు. 

రాజీవ్ సతీమణి, ప్రముఖ యాంకర్, నటి సుమ అత్తగారితో ఆమె అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నన్ను కోడలిగా కాకుండా కన్నా కూతురిలా చూసుకున్నారని సుమ తెలిపారు.

ALSO READ: రాజీవ్-సుమ కనకాల ఇంట విషాదం