ENGLISH

గ్లామ్‌ షాట్‌: హాట్‌ అండ్‌ స్పైసీ రకుల్‌ - ఈమెకేమయ్యింది?

09 February 2018-13:20 PM

బాలీవుడ్‌లో సెగలు పుట్టించేస్తోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ 'మేగ్జిమ్‌' గ్లామర్‌తో. మేగ్జిమ్‌ కోసం రకుల్‌ ఇచ్చిన పోజులు బాలీవుడ్‌లోనే కాదు, సౌత్‌లో కూడా టెంపరేచర్స్‌ పెంచేస్తోంటే, ఆమె అభిమానులు ఆ హాట్‌ సెగల్ని మేగ్జిమమ్‌ ఎంజాయ్‌ చేసేస్తున్నారు. హాట్‌ హాట్‌గా రకుల్‌ సినిమాల్లో కన్పించడం కొత్తేమీ కాదు. 'పరేసానురా' అంటూ 'ధృవ' సినిమాలోని పాటతో సెగలు పుట్టించేసింది రకుల్‌. అంతకు ముందూ చాలా సినిమాల్లో చాలా చాలా హాట్‌గా రకుల్‌ హాట్‌ అప్పీల్‌ పంచేసింది. ఎంతగా ఆ సొగసుల్ని వెండితెరపై ఆరబోసేసినా, ఇంకా ఏదో కొత్త గ్లామర్‌ ఆమెలోంచి తొంగి చూస్తూనే వుంది. అదే రకుల్‌ ప్రత్యేకత. బాలీవుడ్‌లో తన కొత్త సినిమా 'అయ్యారీ' ప్రమోషన్స్‌ కోసమే మేగ్జిమ్‌పై రకుల్‌ ఇంతలా రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో అయితే రకుల్‌కి ప్రస్తుతం సినిమాలేమీ లేవుగానీ, తమిళంలో మాత్రం రెండు మూడు సినిమాలు చేస్తోంది. ఈ మేగ్జిమ్‌ సెగలతో రకుల్‌ మళ్ళీ టాలీవుడ్‌లో హాట్‌ హాట్‌గా అవకాశాలు దక్కించుకోవడం ఖాయమేనని ఫిక్సయిపోవచ్చు.

ALSO READ: Qlik Here Maxim Hot Photoshoot