ENGLISH

భళ్లాలదేవుడు ఫ్రీ అయిపోయాడు

29 September 2017-13:07 PM

ఇటీవలే నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించి మంచి హిట్‌ని తన ఖాతాలో వేసేసుకున్నాడు రానా. రానాకి తమిళంలోనూ పాపులారిటీ ఉంది. అందుకే ఈ సినిమాని తమిళంలోనూ విడుదల చేసేందుకు విసృతంగా ప్రచారాలు చేశారు. ఈ ప్రచారాల నిమిత్తం బిజీ బిజీగా గడిపేశారాయన. 'బాహుబలి' నుండీ వరుస సినిమాలతో బిజీ ఉన్నాడు రానా. 'బాహుబలి' తర్వాత 'ఘాజీ', ఆ తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలతో వరుసగా ఆడియన్స్‌ని పలకరించాడు రానా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా ఉన్న రానా త్వరలోనే హాలీవుడ్‌లోనూ అడుగు పెట్టనున్నాడు. హాలీవుడ్‌ సినిమాలో రానా శాస్త్రవేత్త క్యారెక్టర్‌లో నటించబోతున్నారనీ హాలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. ఎప్పుడూ రానా బిజీ బిజీగానే గడుపుతూంటాడు. అయితే సినిమాలు, లేదంటే వాణిజ్య ప్రకటనలు, ఇప్పుడు బుల్లితెరపైనా సందడి చేస్తున్నాడు. బుల్లితెరపై రానా 'నెం 1 యారి' ప్రోగ్రాంకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వీకెండ్‌లో సెలబ్రిటీస్‌తో ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్నాడు రానా ఈ ప్రోగ్రాం ద్వారా. ఇలా ఒక్కటేమిటీ రానా ఎప్పుడూ బిజీనే. ఓ వెబ్‌ సిరీస్‌లో కూడా రానా నటిస్తున్నాడు. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు రానా. వరుస సినిమాలతోనూ, వరుస ప్రోగ్రాంస్‌తోనూ బిజీగా ఉండే రానా ప్రస్తుతం కొం..చెం.. ఫ్రీ అయ్యాడట. ముఖానికి వేసుకున్న మేకప్‌ తీసేసి, నార్మల్‌ గెటప్‌లోకి వచ్చేశాడట. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. 'రాజు, నేవీ అధికారి, రాజకీయ నాయుకుడి పాత్రల తర్వాత మళ్లీ నా పాత్రలోకి వచ్చేశాను. నన్ను ఇంతగా ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు..' అంటూ రానా ట్వీట్‌ చేసి, ఫోటో కూడా షేర్‌ చేశారు.