ENGLISH

ఈ టైటిల్ ఎవ‌రి కోసం?

10 March 2017-15:28 PM

టాలీవుడ్‌లో ఇప్పుడో టైటిల్ చ‌క్క‌ర్లు కొడుతోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌లో ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో న‌మోదైన ఆ టైటిల్‌.. 'రారండోయ్‌... వేడుక చూద్దాం'. మంచి ఫ్యామిలీ ట‌చ్ ఉన్న ఈ టైటిల్ ఏ హీరో కోస‌మా??  అంటూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారంతా. అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో రెండు సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ఒక‌టి నాగ‌చైత‌న్య‌తో.. మ‌రోటి అఖిల్‌తో. నాగ‌చైత‌న్య - క‌ల్యాణ్ కృష్ణ సినిమా ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉంది. అఖిల్ రెండో చిత్రం విక్ర‌మ్ కె.కుమార్‌తో ఫిక్స‌య్యింది. మ‌రి ఈ రెండు సినిమాల్లో దేనికి ఈ టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి. అఖిల్ కంటే చైతూ సినిమాకే ఈ టైటిల్ యాప్ట్ అని, త్వ‌రలోనే ఈ టైటిల్‌ని అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని చెబుతున్నారు.

ALSO READ: చిత్రాంగ‌ద‌ మూవీ రివ్యూ & రేటింగ్స్