ENGLISH

కోర్టుకి హాజరయిన సల్మాన్ ఖాన్

04 August 2017-15:25 PM

బ్లాక్ బస్టర్ హిట్స్ తోనే కాకుండా వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ అయిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ రోజు కోర్టుకి హజరయ్యాడు.

వివరాల్లోకి వెళితే, జింకలని వేటాడిన కేసుకి సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడు అన్న కేసులో ముంబైలోని సెషన్స్ కోర్టులో సల్మాన్ విచారణకి వచ్చాడు. ఇక ఈ కేసుని కోర్టు అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేశారు.

ఇప్పటికే ఆయన పైన హిట్ అండ్ రన్ అలాగే వన్యమృగాలని వేటాడిన కేసులు ఉన్నాయి. మరి ఈ కేసులన్నిటి నుండి ఆయన ఎప్పుడు బయటపడతాడో చూడాలి.

 

ALSO READ: దర్శకుడు మూవీ రివ్యూ & రేటింగ్స్