ENGLISH

సర్కార్‌ 3 మూవీ రివ్యూ & రేటింగ్స్

12 May 2017-16:33 PM

తారాగణం: అమితాబ్‌ బచ్చన్‌, అమిత్‌ సాద్‌, యామీ గౌతమ్‌, జాకీ ష్రాఫ్‌, రోనిత్‌ రాయ్‌, మనోజ్‌ బాజ్‌పాయి, పరాగ్‌ త్యాగి, రోహిణి, బజ్‌రంగ్‌బలి సింగ్‌
సంగీతం: రవి శంకర్‌
సినిమాటోగ్రఫీ: అమోల్‌ రాథోడ్‌
దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ
నిర్మాతలు: రాహుల్‌ మిత్రా, ఆనంద్‌ పండిట్‌, గోపాల్‌ శివరామ్‌ దాల్వి, కృష్ణ చౌదరి
నిర్మాణం: అలుంబ్రా ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎబి కార్ప్‌ లిమిటెడ్‌ 

* కథా కమామిషు 

సర్కార్‌, సర్కార్‌-2 చిత్రాలకు కొనసాగింపు ఈ సర్కార్‌-3. గాడ్‌ఫాదర్‌గా ముందు చిత్రాల్లో కనిపించిన అమితాబ్‌, ఇందులోనూ అలాగే కనిపిస్తాడు. అయితే ఆ ఇమేజ్‌లోంచి, అందులో ఉన్న సమస్యల నుంచి బయటపడేందుకు సర్కార్‌ చేసే ప్రయత్నాలే ఈ సర్కార్‌-3. ఇంతకీ సర్కార్‌ అనుకున్నది సాధించాడా? అది తెరపైనే చూడాలి. 

* నటీనటులెలా చేశారు 

అమితాబ్‌ బచ్చన్‌ ఎట్‌ హిజ్‌ బెస్ట్‌ అని ఎన్నో సినిమాలకు చెప్పుకుంటూనే ఉన్నాం. ఇందులోనూ ఆయన 'బెస్ట్‌' ఇచ్చారు. అది ఆయనకు అలా అలవాటైపోయింది. సర్కార్‌ పాత్రలో అమితాబ్‌బచ్చన్‌ని చూడగానే అదో వైబ్రేషన్‌ వచ్చేస్తుంటుంది ప్రేక్షకులకి. అది ఆ పాత్ర గొప్పతనమే కాదు, అందులో నటించిన అమితాబ్‌ది కూడా.

అమిత్‌ సాద్‌, సుప్రియా పాఠక్‌, మనోజ్‌ బాజ్‌పాయి, జాకీష్రాఫ్‌, రోనిత్‌ రాయ్‌, పరాగ్‌ తదితరులంతా అద్భుతమైన నటనా ప్రతిభతో ఆకట్టుకుంటారు. యామీ గౌతమ్‌, రోహిని తమ నటనతో సినిమాకి అదనపు ఆకర్షణ అయ్యారు. 

* విశ్లేషణ

సాధారణ కమర్షియల్‌ సినిమాకి వుండే హంగులు ఇందులో కనిపించవు. సినిమా మొత్తం సీరియస్‌ టోన్‌లో సాగుతుంది. ప్రతి సన్నివేశం ఎట్రాక్ట్‌ చేస్తుంది. మూడ్‌కి తగ్గ డైలాగ్స్‌ సినిమాటోగ్రఫీ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇలా అన్నీ కుదరడంతో ఈ తరహా సినిమాల్ని ఇష్టపడేవారిని సీట్లోంచి కదలనివ్వదు. కొన్ని సీన్స్‌ సర్కార్‌1 నుంచి రిపీట్‌ అయినట్లుగా అనిపిస్తాయిగానీ, అది కూడా చాలా తక్కువే. టెక్నికల్‌ బ్రిలియన్స్‌తో వర్మ మరోసారి సత్తా చాటాడు. వర్మ మార్క్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ సినిమా ఫుల్‌ మీల్స్‌ లాంటిదని చెప్పవచ్చు.

* సాంకేతిక వర్గం పనితీరు

సింపుల్‌ కథని అత్యద్భుతంగా చెప్పడంలో వర్మ దిట్ట. ఈ క్రమంలో సాంకేతిక విభాగాల్ని ఆయన సమర్థవంతంగా వినియోగించుకుంటున్న తీరే అతన్ని మిగతా దర్శకులకన్నా బిన్నంగా మార్చింది. డైలాగ్స్‌ దగ్గర్నుంచి మ్యూజిక్‌ దాకా ప్రతి విషయంలోనూ వర్మ తీసుకునే కేర్‌ ప్రత్యేకమైనది. అమోల్‌ రాథోడ్‌ సినిమాటోగ్రఫీ అద్భుతం. రవిశంకర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళుతుంది. చాలా డైలాగ్స్‌ గుర్తుపెట్టుకోదగ్గవి. నిర్మాణపు విలువలు అమోఘం. 

* ఫైనల్‌ వర్డ్‌

సర్కార్‌-3 వర్మ ఈజ్‌ బ్యాక్‌ 

యావరేజ్ యూజర్ రేటింగ్: 3.25/5


రివ్యూ బై శేఖర్

ALSO READ: సర్కార్ 3 ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి