ENGLISH

శమంతకమణి మూవీ రివ్యూ & రేటింగ్స్

14 July 2017-15:25 PM

నటీనటులు: నారా రోహిత్‌.. సుధీర్‌బాబు.. సందీప్‌కిషన్‌.. ఆది.. రాజేంద్రప్రసాద్‌.. సుమన్‌.. ఇంద్రజ.. చాందినీ చౌదరి.. అనన్య సోని.. జెన్నీ హనీ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి
కళ: వివేక్‌ అన్నామలై
నిర్మాత: వి.ఆనంద్‌ ప్రసాద్‌
కథ.. దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య
నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్‌  

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.75/5

కథ:

కృష్ణ(సుధీర్‌బాబు) హైదరాబాద్‌లో ఓ భారీ పార్టీ ఇస్తాడు. పుట్టుక తో ధనవంతుడైన కృష్ణ ఎప్పుడూ పార్టీల తో సరదా గా గడుపుతూ ఉంటాడు. ఆ పార్టీలో ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే ఓ కారు మాయమవుతుంది. దాని పేరు ‘శమంతకమణి’. అదే పార్టీ కి ఉమామహేశ్వరరావు(రాజేంద్రప్రసాద్‌), శివ(సందీప్‌ కిషన్‌), కార్తీక్‌(ఆది). హాజరవుతారు. వారిని అనుమానితులుగా గుర్తిస్తారు. కారును ఎవరు దొంగిలించారో తెలియని స్థితి లో కారును ఎవరు దొంగిలించారో తెలుసుకోవడానికి ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ (నారారోహిత్‌) కు ఇన్వెస్టిగేషన్ భాద్యత అప్పగిస్తారు. విచారణ ప్రారంభిస్తాడు. ఇంతకీ అసలు కార్ను ఎవరు దొంగిలించారో తెలుసుకోవడమే ఈ చిత్ర కథ

నటీ నటుల పనితనం:

ఈ చిత్రం లో ప్రధానం గా నలుగురు కథానాయకులు. నారా రోహిత్‌.. సుధీర్‌బాబు.. సందీప్‌కిషన్‌.. ఆది తమ తమ పాత్రలకు తగ్గట్టుగా ఆకట్టుకొనే నటన ను కనబరిచారు.

ఈ చిత్రం లో రాజేంద్రప్రసాద్‌ కూడా తన పాత్ర ద్వారా చక్కని ప్రతిభ ను కనబరిచే ప్రయత్నం చేసాడు. దర్శకుడు కూడా అందరు నటీ నటులకు సమ ప్రాధాన్యం ఉండే పాత్రలను తీర్చిదిద్దాడు. అన్ని పాత్రలు తమ తమ రీతిలో ఉండే లా చక్కని క్యారెక్టర్రైజేషణ్ ఉండడం చక్కని అంశం.

అందరిలోకి సుదీర్ బాబు, నారా రోహిత్ చక్కని ప్రతిభ కనబరిచారు. రాజేంద్రప్రసాద్‌- ఇంద్రజ మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ బాగుంది. సుమన్న కూడా మంచి పాత్ర లో మెరిసాడు. మిగిలిన అందరూ నటీ నటులు తమ పాత్రలకు అనుగుణంగా ఉంటూ ముఖ్య పాత్రధారులకు చక్కని సహాయం అందజేయడం లో తమ సత్తా చాటారు

విశ్లేషణ:

ఈ చిత్రానికి కథ ప్రధాన అంశం. కారు పోయిన పాయింట్‌తో కథ మొదలవుతుంది. ఆ కథ ను నడిపించిన విధానం చక్కగా కుదిరింది. ఒక్కోపాత్రను పరిచయం చేయడం దగ్గర నుండి  ఆ పాత్ర స్వభావాన్ని విడమర్చే వరకు చాలా చక్కగా కథను తీసుకెళ్ళాడు దర్శకుడు. పాత్రల పరిచయంతోనే తొలి అర్ధభాగాన్ని నడిపించడం కాస్త నిరాశ అయినా చిత్రాన్ని రంజింపజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీరామ్. దీంతో కథ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. కాని రెండో భాగం లో కథ కాని సినిమా కానీ ఏ ఒక్క చోట కూడా ఆగుతుంది అని అసలు అనిపించదు. ఇటువంటి తరహా చిత్రాలకు ఒక తరహా ఫార్ములా ఉంటుంది. ఈ చిత్ర దర్శకుడు దాన్ని చక్కగా ఫాలో అయ్యాడు. అన్ని ఒక ఎత్తు అయితే, చిత్ర పతాక సన్నివేశాలకు ముందు వచ్చే ట్విస్ట్‌ ఇంకో ఎత్తు అవుతుంది. ఆ ట్విస్ట్ చాలా చక్కగా కుదిరింది ఈ చిత్రం లో. కథను ముగించిన తీరు కూడా ఆకట్టుకునేలా ఉంటుంది.

ఈ చిత్రానికి గల సాంకేతిక అంశాలు చాలా ఎక్కువ. అందరూ తమ అనుభవాన్ని ఉపయోగించి చిత్రాన్ని మంచిగా రూపొందించే ప్రయత్నం చేసారు. ఈ చిత్రం లో సమీర్‌రెడ్డి కెమేరా పనితనం బాగుంది. అందరు నటులను అందంగా చూపించారు. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తుంది. అలాగే చిత్రాన్ని చాలా వరకు ఎలివేట్ చేసందుకు కూడా సహకరించింది. ఈ చిత్రానికి సంబంధించి ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి అయినప్పటికీ అన్ని పాత్రలను పరిచయం చేసేందుకు డైరెక్టర్ చేసిన ప్రతిభ ప్రసంశానీయాంశం. తోలి భాగం మొత్తం పాత్రల ను పరిచయం చేయడం, కథను సెట్స్తుం చేయడం వరకు ఉంటుంది. కానీ రెండో భాగం లో కథను ముందుకు తీసుకెళ్తూ చక్కగా ట్విస్ట్ని లను జోడించే ప్రయత్నం చేసారు దర్శక నిర్మాతలు. భవ్య క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు కూడా చక్కగా ఉపయోగపడ్డాయి.

బలాలు

+ నలుగురు కథానాయకులు
+ నటుల పనితీరు
+ సాంకేతిక విలువలు
+ నేపథ్య సంగీతం
+ కెమెరా పనితనం

బలహీనతలు

- స్లో నరేషన్
- కథ 

చివరి మాట:

మంచి నటన, అంతకు మించిన ట్విస్ట్ తో కూడుకున్న ఈ కథాంశం అందరినీ అలరించడం లో విజయం సాదించింది. ఒకసారి చూడదగ్గ చిత్రం.

రివ్యూ బై రామ్

ALSO READ: ఈ చిత్రం ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి