ENGLISH

'సంఘమిత్ర' ప్రిన్సెస్‌ అదుర్స్‌

19 May 2017-12:03 PM

శృతిహాసన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'సంఘమిత్ర'. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని ఇండియన్‌ సినిమాగా భావించవలసి ఉంటుంది. ఎందుకంటే సినిమాని అంత భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ దర్శకుడు సుందర్‌ సి రూపొందించనున్న ఈ చిత్రం చారిత్రక గాధ ఆధారంగా రూపొందుతోందని సమాచారమ్‌. సినిమాకి సంబంధించి ఇప్పటికే రెండు లుక్స్‌ విడుదలయ్యాయి. వీటిల్లో తమిళ హీరో ఆర్య కనిపిస్తున్న లుక్‌ ఒకటి. లేటెస్ట్‌ లుక్‌ శృతిహాసన్‌ మీద విడుదల చేశారు. రెండూ దేనికదే భిన్నంగా కనిపిస్తూ, సినీ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. 'బాహుబలి' ఇచ్చిన ఉత్సాహమో, ఇంకేదైనా కారణమోగానీ దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి భారతీయ వెండితెరపై మరో అద్భుతం కాబోతోంది 'సంఘమిత్ర'. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసమే హీరోయిన్‌ శృతిహాసన్‌ యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించింది. కత్తి పోరాటాలే కాకుండా గుర్రపు స్వారీ ఇతరత్రా ప్రాచీన కళల్ని శృతిహాసన్‌ నేర్చుకుందట. కుమార్తెకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి తన అనుభవాన్ని కమల్‌హాసన్‌ రంగరిస్తున్నారని సమాచారమ్‌. అయితే, సినిమాతో సంబంధం లేకుండా పూర్తిగా తన కుమార్తెకు యుద్ధ విద్యల్లో మాత్రమే శిక్షణ ఇప్పిస్తున్నాడట కమల్‌హాసన్‌. ఏదేమైనా 'సంఘమిత్ర'లో ప్రిన్సెస్‌ లేదా పోరాటయోధురాలు శృతిహాసన్‌ అత్యద్భుతంగా కనిపిస్తుండడం గొప్ప అంశం.

ALSO READ: RGV'S TWEET RESULTS IN REGIONAL FIGHTS?