ENGLISH

ఎటు చూసినా 'స్పైడర్‌' జపమే

27 September 2017-13:23 PM

ఈ రోజు 'స్పైడర్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ ఎక్కడ చూసినా స్పైడర్‌ గురించిన చర్చే. ఈ సినిమాపై ఉన్న అంచనాలు అలా ఇలా లేవు. తెలుగులోనూ, తమిళంలోనూ కూడా సినిమా విడుదలవుతోంది. మహేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సినిమాగా 'స్పైడర్‌' తెరకెక్కింది. అత్యంత ఎక్కువ ధియేటర్స్‌లో 'స్పైడర్‌' విడుదలవుతోంది. 'స్పైడర్‌' విడుదలవుతోన్న ధియేటర్స్‌ వద్ద సందడి అలా ఇలా లేదు. అభిమానుల కోలాహలం ఓ రేంజ్‌లో ఉంది. అన్ని వర్గాల వారినీ 'స్పైడర్‌' అలరించనుందని అంచనా. ప్రీ రిలీజ్‌ టాక్‌కి పోజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాత్రి నుండే చాలా చోట్ల షోలు పడడంతో, టాక్‌ బాగా వినిపిస్తుండడంతో సినిమా విజయం సాధించేసినట్లే అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాకి ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా బాగా నిర్వహించింది చిత్ర యూనిట్‌. మీడియా పరంగా మహేష్‌బాబు ఇచ్చిన ఇంట్రెస్టింగ్‌ ఇంటర్వ్యూస్‌ సినిమాపై క్యూరియాసిటీ పెరిగేలా చేశాయి. తెలుగులోనే కాదు, తమిళంలోనూ సినిమాపై అంచనాలు అలాగే ఉన్నాయి. మరుగదాస్‌ సినిమాలకి తమిళంలో పాపులారిటీ సంగతి తెలిసిందే. ఇక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తమిళంలో గతంలోనూ పలు చిత్రాలు చేసినప్పటికీ ఈ సినిమా ఆమెకి ఎంతో స్పెషల్‌ ప్రస్తుతం. మహేష్‌, రకుల్‌ జంట చూడముచ్చటగా అలరిస్తోంది. తమిళంలో సూపర్‌ ఫాలోయింగ్‌ ఉన్న దర్శకుడు, నటుడు ఎస్‌.జె.సూర్య విలన్‌ అప్పియరెన్స్‌ ఈ సినిమాకి పెద్ద ప్లస్‌.

ALSO READ: స్పైడ‌ర్‌ రివ్యూ & రేటింగ్స్