ENGLISH

చిరంజీవి 'సైరా' కొత్త సంగతులివేరా!

22 September 2017-12:02 PM

చిరంజీవి రీ ఎంట్రీలో వచ్చిన సినిమా 'ఖైదీ నెంబర్‌ 150' తర్వాత చేస్తున్న మూవీ 'సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే హైద్రాబాద్‌లో నానక్‌ రామ్‌ గూడలో ఓ భారీ సెట్‌ని సిద్ధం చేసింది చిత్ర యూనిట్‌. ఇక చిరంజీవి లుక్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బాడీ ఫిట్‌నెస్‌ విషయంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ నుండి తగిన సూచనలు సలహాలు తీసుకుంటూ కసరత్తులు చేస్తున్నారు చిరంజీవి. ఇది చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం. బ్రిటీష్‌ కాలం నాటి చరిత్ర. ఆ చరిత్రకి సంబంధించిన ఆనవాళ్లతో సెట్స్‌ సిద్ధం చేయాలి. అదే పనిలో బిజీగా ఉంది చిత్ర యూనిట్‌. అక్టోబర్‌ 20 నుండి సినిమా సెట్స్‌ మీదికి వెళ్లే అవకాశాలున్నాయని తెలియ వస్తోంది. కాస్టింగ్‌, సాంకేతిక నిపుణుల ఎంపిక అంతా సిద్ధమైంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంది. అందుకోసం ప్రత్యేకంగా హాలీవుడ్‌ నుండి టెక్నికల్‌ టీమ్‌ని దించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతోంది 'సైరా నరసింహారెడ్డి'. అన్ని భాషల నుండీ ప్రముఖ నటీ నటులు ఈ సినిమా కోసం నటిస్తున్నారు. బాలీవుడ్‌ నుండి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవికి ప్రెస్టీజియస్‌ మూవీ ఇది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

ALSO READ: జై లవకుశ మూవీ రివ్యూ & రేటింగ్స్