ENGLISH

త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో చరణ్‌?

09 February 2018-15:15 PM

ఎప్పటినుండో ఈ కాంబినేషన్‌ గురించి గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. కానీ వర్కవుట్‌ కావడం లేదు. పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమాని నిర్మిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. చరణ్‌ 'రంగస్థలం' సినిమా తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే 'రంగస్థలం' తర్వాత చరణ్‌ ఏ సినిమా చేస్తాడనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ, కొత్తగా తెరపైకొచ్చిన ఈ కాన్సెప్ట్‌పై ఆలోచన చేసే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్‌ మెగా కాంపౌండ్‌లో పవన్‌ కళ్యాణ్‌తో మూడు సినిమాలు తెరకెక్కించగా, అల్లు అర్జున్‌తో 'జులాయి' సినిమాని తెరకెక్కించాడు.

వీటిలో ఇటీవల వచ్చిన 'అజ్ఞాతవాసి' సినిమా తప్ప మిగిలిన చిత్రాలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్స్‌ అయ్యాయి. గతంలో చిరంజీవి నటించిన ఓ సినిమాకి త్రివిక్రమ్‌ డైలాగ్‌ రైటర్‌గా పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చరణ్‌తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు త్రివిక్రమ్‌. అది ఇప్పటికైనా తీరుతుందేమో చూడాలి మరి. ఒకవేళ ఈ కాంబినేషన్‌ వర్కవుట్‌ అయితే అంచనాలు బీభత్సంగానే ఉంటాయి. ఇకపోతే, చరణ్‌ 'రంగస్థలం' విషయానికి వస్తే, ఇదో ప్రయోగాత్మక చిత్రం.

'చిట్టిబాబు' పాత్రలో చరణ్‌ ఇప్పటికే సినిమాపై పోజిటివ్‌ వైబ్రేషన్స్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. హాట్‌ హాట్‌ సమ్మర్‌లో కూల్‌ కూల్‌గా హాయైన పల్లెటూరి వాతావరణంలోకి తీసుకెళ్లేందుకు చరణ్‌ 'రంగస్థలం' సినిమాతో మార్చి 30న దూసుకొచ్చేస్తున్నాడు. సమంత ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకుంది.

ALSO READ: ఇంటెలిజెంట్ మూవీ రివ్యూ & రేటింగ్స్