ENGLISH

నాని 'MCA' సెన్సార్ రిపోర్ట్

15 December 2017-18:16 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన MCA(మిడిల్ క్లాస్ అబ్బాయ్) చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ నుండి ఎలాంటి కట్స్ లేకుండా 'U/A' సర్టిఫికెట్ ని పొందింది.

సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని నిర్మాతలు చెబుతున్నారు. రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లోని రెండు సాంగ్స్ ఇప్పటికే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. మిగతా సాంగ్స్ రేపు వరంగల్ హన్మకొండ లో జరిగే ప్రీ-రిలీజ్ వేడుకలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

ఇందులో నాని కి జోడీ గా సాయి పల్లవి నటిస్తుండగా.. భూమిక, రాజీవ్ కనకాల ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ALSO READ: రామ్‌గోపాల్‌ వర్మ 'కడప' రక్త చరిత్ర చూశారా?