ENGLISH

ప్రభుదేవాతో సినిమా - గాల్లో తేలుతున్న ఆదాశర్మ

18 November 2017-18:41 PM

తమిళంలో ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో క్యూట్‌ బ్యూటీ ఆదాశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు ఆదాశర్మ ఆనందానికి అవధులే లేవు. ఎందుకంటే ప్రభుదేవా అంటే ఆదాశర్మకి ఎంతో ఇష్టమట. బేసిగ్గా అమ్మడు మంచి డాన్సర్‌. సో ప్రభుదేవా కొరియోగ్రాఫీలో ఒక్కసారైనా డాన్సు చేయాలని అనుకునేదట. అలాంటిది ఒక్క డాన్సేంటి, ఏకంగా ఆయనతో కలిసి నటించే ఛాన్స్‌ దక్కినందుకు ఆమె అసలు భూమ్మీదే నిలబడట్లేదంటే నమ్మి తీరాల్సిందే.  

ప్రభుదేవా హీరోగా 'చార్లీ చాప్లిన్‌ - 2' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఆదాశర్మని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా ఇంత గొప్ప ఛాన్స్‌ దక్కింనందుకు ఈ ముద్దుగుమ్మ తనకన్నా ఆదృష్టవంతురాలు ఈ భూమ్మీద లేదనిపిస్తోందని మురిసిపోతోంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. యంగ్‌ హీరోస్‌తోనూ, స్టార్‌ హీరోస్‌ సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్‌గానూ నటించింది ఈ బ్యూటీ. అయితే అవన్నీ ఓ ఎత్తు. ఈ సినిమా ఒక్కటీ ఒక ఎత్తు అంటోంది. ఈ సినిమా విషయంలో ఆదాశర్మ ఎగ్జయిట్‌మెంట్‌కి మాటలు చాలడం లేదంట.

 

తెలుగులో 'క్షణం' సినిమా ఆదాకి పర్‌ఫామెన్స్‌ పరంగా మంచి గుర్తింపు దక్కింది. అలాగే 'సన్నాఫ్‌ సత్యమూరి' సినిమాలోనూ క్యారెక్టర్‌ చిన్నదే అయినా కానీ స్పెషల్‌గా ఎట్రాక్ట్‌ చేసింది. ఇక తొలి సినిమా 'హార్ట్‌ ఎటాక్‌'తో కుర్రోళ్ల గుండెల్లో గూడు కట్టేసుకుంది. అలాగే బాలీవుడ్‌లో 'కమాండో - 2' చిత్రంలో అమ్మడి పర్‌ఫామెన్స్‌ కెవ్వు కేక అని చెప్పక తప్పదు. ఇప్పుడు తమిళంలో తాజా చిత్రం 'చార్లీ చాప్లిన్‌ - 2'తో ఆదా శర్మ తమిళ తంబీల హృదయాల్ని ఎలా కొల్లగొట్టనుందో చూడాలిక.

ALSO READ: AP స్పెషల్ స్టేటస్ పైన ప్రకాష్ రాజ్ స్పందన