ENGLISH

అది తాగితే డ్రగ్స్ టెస్ట్ లో దొరకరట?

25 July 2017-19:09 PM

ఇప్పుడు ఎక్కడ చూసిన డ్రగ్స్ గురించే పెద్ద చర్చ సాగుతుంది. అలానే డ్రగ్స్ రాకెట్ లో టాలీవుడ్ ప్రముఖులని SIT విచారణ పై కూడా అందరి దృష్టి ఉంది.

ఇక ఆ విచారణ సందర్భంగా విచారణకు వస్తున్న వారి నుండి బ్లడ్, వెంట్రుకలు, గోళ్ళు శాంపిల్స్ సేకరిస్తున్నారు అని, వాటితో ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో ఇట్టే తెలిసిపోతుంది అన్న టాక్ బయటకి వచ్చింది.

అయితే ఈ విషయానికి సంబందించిన ఒక షాకింగ్ రూమర్ బయట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే- విచారణకు వచ్చే ప్రతిఒక్కరు అలోవిరా జ్యూస్ ని సేవించి విచారణకు హాజరు అవుతున్నారు అని?! ఇలా చేయడం వల్ల వారి నుండి సేకరించిన శాంపిల్స్ లో డ్రగ్స్ కి సంబందించిన అవశేషాలు అంత తేలిగ్గా బయటపడవట?!!

అయితే ఈ విషయం తెలుసుకున్న SIT అధికారులు సైతం అందుకు తగ్గ విరుగుడు పద్ధతులు వాడుకలోకి తెస్తున్నారు అని అంటున్నారు!

ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కాని, ఒకవేళ నిజమయితే మాత్రం ఇది ఒక పెద్ద సంచలనమనే చెప్పాలి.

ALSO READ: చార్మీకి షాక్ ఇచ్చిన హైకోర్టు