ENGLISH

భాగమతి సెన్సార్ రిపోర్ట్

18 January 2018-17:24 PM

లేడీ సూపర్ స్టార్ అనుష్క తాజా చిత్రం భాగమతి వచ్చే వారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా అనుష్క భాగమతి చిత్ర సెన్సార్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. 

సెన్సార్ వివరాల ప్రకారం, ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇవ్వగా, చిత్రం పూర్తీ నిడివి వచ్చి 2గంటల 20నిమిషాలుగా తెలిసింది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ కి మంచి క్రేజ్ ఏర్పడగా అనుష్క పోషించిన పాత్రని చూడగానే అందరికి అరుంధతి చిత్రంలో అనుష్కని చూసినట్టుగానే ఫీల్ అయ్యారు. 

ఇక ఈ చిత్రంలో అనుష్కదే కీలక పాత్ర కాగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ మరొక కీలక పాత్రలో కనపడనున్నాడు. అలాగే ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ బాషలలో జనవరి 26న విడుదలవ్వనుంది. తెలుగులో UV క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తుండగా అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. 

మొత్తానికి అరుంధతి స్థాయిలో ఈ చిత్రం ఉంటుంది అంటూ అభిమానులు, సాధారణ ప్రేక్షకులు ఒక అంచనాకి రావడం జరిగింది.

 

ALSO READ: నా పేరు సూర్య శాటీలైట్ రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే