ENGLISH

#Chiru151 లో అనుష్క?

17 October 2017-20:26 PM

చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో భారీ తారాగణం ఉండనుంది అన్న అంచనాలు నడుమ ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ ఆ జాబితాలో చేరనుంది అన్న పుకార్లు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే- స్టార్ హీరోయిన్ అనుష్కని సైరా చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం తీసుకోనున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే దర్శక-నిర్మాతలు ఆమెని సంప్రదించడం, కథ చెప్పడం కూడా జరిగిపోయాయట. ఆమె పాత్రతో అనుష్క కూడా సంతృప్తిచెందినట్టు సమాచారం.

ఇక ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ దశకి వెళ్ళాల్సి ఉన్నా కొన్ని ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు వల్ల షూటింగ్ ఇంకొన్ని రోజులు వాయిదాపడింది. మొత్తానికి సైరా చిత్రంలో నటించే స్టార్స్ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది.

చూద్దాం.. రాబోయే కాలంలో ఇంకే స్టార్ ఎంట్రీ ఇవ్వనున్నారో..

 

ALSO READ: వర్మతో స్క్రీన్‌ప్లే రాయిస్తున్న స్వర్గీయ ఎన్టీఆర్‌!