ENGLISH

భానుమతి పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన అనుష్క

19 February 2018-13:17 PM

మహానటి చిత్రంలో లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించబోతున్నట్టుగా వార్తలు రావడంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆమె ఏ పాత్రలో కనిపించబోతున్నది అన్నదాని పైన పడింది. 

ఆమె అలనాటి నటి భానుమతి పాత్రలో కనిపించనున్నది అని వార్తలు గట్టిగానే వినపడ్డాయి. అయితే ఆమె నుండి మాత్రం దీని పైన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ తరుణంలో ఆమె సన్నిహిత వర్గాలు అలాగే మహానటి చిత్ర యూనిట్ కూడా ఈ అంశం పైన క్లారిటీ ఇచ్చేసింది.

అదేమనగా- అనుష్క మహానటి చిత్రంలో భానుమతి పాత్ర చేయడం లేదు అని అలాగే ఆ చిత్రంలో ఎటువంటి పాత్రలో సైతం ఆమె నటించడం లేదు అని వివరణ ఇచ్చేశారు. దీనితో ఈ పూర్తి ఎపిసోడ్ ఒట్టి పుకారు అని తేలిపోయింది. 

ఇక మహానటి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది.

 

ALSO READ: గుండు హనుమంతరావు ఇక లేరు