ENGLISH

మెగా పవర్ స్టార్ ని ఢీ కొడుతున్న ఆర్యన్ రాజేష్..

19 February 2018-12:07 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బోయపాటి శ్రీను తో కలిసి చేయబోయే చిత్రంలో ఒకప్పటి హీరో ఆర్యన్ రాజేష్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

ఆ వివరాల్లోకి వెళితే, రామ్ చరణ్ కి అన్నయ్య పాత్రలో మాజీ హీరో ఆర్యన్ నటించనున్నాడట. అయితే దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. ఇప్పట్టికే ఈ చిత్రంలో స్నేహ, తమిళ హీరో ప్రశాంత్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో విలన్ గా హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తానికి మెగా హీరో సినిమాలో చాలా మంది ప్రముఖ నటులు కనిపించబోతున్నారు. మొన్నీమధ్యనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశారు.

రెండవ షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొంటాడు అని ఇప్పటికే దర్శక-నిర్మాతలు దృవీకరించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీ నటిస్తుంది.

ALSO READ: గుండు హనుమంతరావు ఇక లేరు