ENGLISH

బాహుబలి రోజుకి 5 ఆటలు

24 April 2017-15:13 PM

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలుగు సినిమా 'బాహుబలి'. ఈ సినిమా మొదటి పార్ట్‌ సృష్టించిన సెన్సేషన్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ శుక్రవారం 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్‌ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ప్రపంచం మొత్తం ఎదురు చేస్తోంది ఈ సినిమా కోసం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రోజుకు ఈ సినిమాను ఆరు ఆటల ప్రదర్శనకు పర్మిషన్‌ ఇచ్చింది. దాదాపు పది రోజుల పాటు ధియేటర్స్‌లో ఆరు ఆటలు 'బాహుబలి' సినిమా కోసం ప్రదర్శించబోతున్నారు ఏపీలో. తాజాగా తెలంగాణాలో కూడా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 'బాహుబలి' నిర్మాతలు తెలంగాణా మంత్రిని కలిసి సినిమా విషయంలో విజ్ఞప్తి చేశారు. మంత్రిగారు తమ నుంచి సినిమాకి కావల్సినంత సపోర్ట్‌ ఉంటుందని హామీ ఇచ్చారు. మరో పక్క తమిళనాడులో ఈ సినిమా విషయంలో వివాదం చెలరేగింది. కోర్టు దాకా వెళ్లిన ఆ వివాదం మెల్లగా సద్దుమణిగింది. తాజాగా కట్టప్ప సత్యరాజ్‌ విషయంలో కర్ణాటకలోనూ వివాదం తలెత్తింది. ఆ వివాదం కూడా చల్లారింది. టోటల్‌గా ఈ సినిమా విడుదలకు ప్రస్తుతం ఆటంకాలన్నీ తొలిగిపోయినట్లే. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతోంది ఈ సినిమా. అంతేకాదు భారీ బడ్జెట్‌తో సినిమాని తెరకెక్కించడం వల్ల టికెట్‌ ధరలు కూడా పెంచేలా ప్రభుత్వం నుండి తగిన అనుమతి పొందేందుకు చిత్ర యూనిట్‌ ప్రయత్నిస్తోందని సమాచారమ్‌. 

ALSO READ: బ‌హ‌ద్దూర్‌గా రామ్ చ‌ర‌ణ్‌??