ENGLISH

భరత్‌ రాజకీయం మొదలైంది..ఫాన్స్ కి పండగే

20 April 2018-11:27 AM

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 'భరత్‌ అనే నేను' చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓపెనింగ్స్‌ అదిరిపోయాయి. 'రంగస్థలం' సూపర్‌ డూపర్‌ హిట్‌ తర్వాత వచ్చిన పెద్ద చిత్రమిది. దాంతో భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి ఈ సినిమాకి. 'భరత్‌' విడుదలయ్యే అన్ని ధియేటర్స్‌ వద్ద అభిమానుల కోలాహలం ఉవ్వెత్తున కొనసాగుతోంది. ప్రీ రిలీజ్‌ బిజినెస్సే ఈ సినిమాకి ఊహించని స్థాయిలో జరిగింది. ప్రివ్యూస్‌ నుండి వచ్చిన రిపోర్ట్స్‌కి మంచి టాక్‌ రావడంతో, ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి.

మహేష్‌ ఫ్యాన్స్‌ ఈ సినిమాని ప్రెస్టీజియస్‌ ఇష్యూగా తీసుకున్నారు. దాంతో విపరీతమైన పబ్లిసిటీ చేశారు. శ్రీరెడ్డి ఇష్యూతో ఛానెల్స్‌లో 'భరత్‌'కి పబ్లిసిటీ విషయంలో కొంత సమస్య ఎదురైనా కానీ అదేమంత పెద్దగా లెక్కలోకి రాలేదు. ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ రేంజ్‌ని మించలేదు. అలాగే ఓవర్సీస్‌లో కూడా భరత్‌ సందడి కొనసాగుతోంది. అసలే ఓవర్సీస్‌ మొనగాడు మహేష్‌. ఇక సినిమాలో ముఖ్యమంత్రిగా మహేష్‌ చాలా స్టైలిష్‌గా, హ్యాండ్‌సమ్‌గా కనిపించాడు. కైరాఅద్వానీ - మహేష్‌ జంట గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

చాలా ఫ్రెష్‌గా కొత్తగా ఉంది సినిమాలో వీరిద్దరి జంట. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో పొలిటికల్‌ పంచ్‌ డైలాగులతో పాటు, చక్కని వినోదం, ఆహ్లాదమైన లొకేషన్స్‌, ఫ్యాన్స్‌ మెచ్చే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చాలా చాలా బాగున్నాయంటున్నారు. కొరటాల - మహేష్‌ కాంబినేషన్‌లో 'భరత్‌ అనే నేను' మరో 'శ్రీమంతుడే' అనే టాక్‌ వినిపిస్తోంది. చూడాలి మరి, ఫైనల్‌ రిజల్ట్‌ ఎలా ఉంటుందో సాయంత్రానికల్లా తేలిపోనుంది.

ALSO READ: ఆర్జీవీ-శ్రీ రెడ్డి అంశం పైన స్పందించిన పవన్ కళ్యాణ్