ENGLISH

బ్యూటీ సెలీనా జైట్లీ

22 September 2017-17:32 PM

మొదట మన శరీరాన్ని మనం ప్రేమించాలంటోంది బాలీవుడ్‌ బ్యూటీ సెలీనా జైట్లీ. మన శరీరంలో వచ్చే మార్పుల్ని మనం అంగీకరించాలంటోంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌. ప్రెగ్నెంట్‌ అయినా కానీ గ్లామరస్‌గా ఫోటో షూట్‌ చేయించుకుని సోషల్‌ మీడియాలో ఆ ఫోటోలను పోస్ట్‌ చేస్తోంది. ఆ ఫోటోలు చూసిన వారంతా ప్రెగ్నెంట్‌గా ఉండి ఎందుకమ్మా నీకీ పాట్లు అనుకుంటారు. కానీ తాను చేసే ఈ ఫోటో షూట్‌తో ఓ గొప్ప మెసేజ్‌ ఇస్తోంది. ఆరోగ్యమైన మాతృత్వానికి అర్ధం చెబుతోంది ఈ బ్యూటీ. ముందుగా మన శరీరాన్ని మనం ప్రేమించుకోగలిగితే, మన శరీరంలో వచ్చే ప్రతీ మార్పునీ మనం ఇష్టంగా అంగీకరించగలిగితే, ఆరోగ్య సమస్య ఏదైనా జయించగలమంటోంది అందాల తార సెలీనా జైట్లీ. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు శరీరం బరువు పెరగడం సహజమైన విషయమే. అయితే ఆ తర్వాత పెరిగిన బరువును తగ్గించుకోలేమేమో అనుకుని అపోహలకు గురవుతూ, మానసికంగా బాధపడుతుంటారు కొందరు మహిళలు. అలా తల్లి మానసిక ఆవేదనకు లోనవడం బిడ్డ మానసిక పరిస్థితిపై ప్రభావితం చూపుతుందని అంటోంది సెలీనా. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అలాంటి ఆవేదనలకు లోను కావాల్సిన అవసరం ఉండదంటోంది. ఇలాంటి విషయాలపై అవగాహన పెంచేందుకు, ఓ మంచి మెసేజ్‌ని జనంలోకి తీసుకెళ్లేందుకే ఇలాంటి ఫోటో షూట్స్‌ చేస్తున్నాననీ హాట్‌ బ్యూటీ సెలీనా అంటోంది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మకి ఆల్రెడీ ట్విన్స్‌ ఉన్నారు.

ALSO READ: దీక్షా చేసిన సంచలన వ్యాఖ్యలు