ENGLISH

బోయపాటి కొత్త ‘టైటిల్’ టాక్

12 August 2017-15:39 PM

బోయపాటి శ్రీను- కమర్షియల్ చిత్రాలకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కేర్ అఫ్ అడ్రస్ గా ఉన్న దర్శకుడు. ఆయన దర్శకత్వం వహించిన జయ జానకి నాయక చిత్రం నిన్న విడుదలై మంచి కమర్షియల్ చిత్రంగా టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉండగా, ఈ చిత్రం టైటిల్స్ పడే సమయంలో బోయపాటి శ్రీను అని  ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు (Boyapati Srinu) ‘O’ అనే అక్షరం నుండి సింహం గాండ్రింపు తో చిత్రం మొదలవ్వటం ఈ చిత్రానికి ఒక హైలైట్ అని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు.

 

ఇండస్ట్రీలో ఇలా టైటిల్స్ ని స్పెషల్ గా వేస్తారు అని పేరున్న దర్శకుల్లో బోయపాటి చేరిపోయాడు. ఏదేమైనా బోయపాటి శ్రీను టైటిల్ లోని తను ఎలాంటి సినిమాలు తీయనున్నాడో మనకు హింట్ ఇచ్చేశాడు.

 

ALSO READ: బిగ్ బాస్ లోకి నవదీప్?