ENGLISH

కంటతడి పెట్టుకున్న కమెడియన్ బ్రహ్మానందం

19 February 2018-13:37 PM

ఈరోజు తెల్లవారుజామున ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు గారు పరమపదించడంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.

ఆయన భౌతికకాయాన్ని తోటి నటీనటులు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా హాస్యనటుడు బ్రహ్మానందం తన స్నేహితుడి పార్ధీవదేహాన్ని చూసి చలించిపోయి కంటతడిపెట్టేశారు, అలాగే తమ మధ్య సాన్నిహిత్యాన్ని కూడా గుర్తుచేసుకుంటూ బోరున విలపించడం అందరినీ కలిచివేసింది.

ఇక బ్రహ్మానందంతో పాటుగా శివాజీరాజా, కాదంబరి కిరణ్, రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ వంటి వారు తమకి హనుమంతరావుకి ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా మా www.iQlikmovies.com తరపున కూడా గుండు హనుమంతరావు గారి మృతికి ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాము.

ALSO READ: కమెడియన్ 'గుండు హనుమంతరావు' హఠాన్మరణం..!