ENGLISH

DSPకి కొత్త అర్ధం చెప్పిన మెగాస్టార్

23 April 2017-17:13 PM

DSP అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఫుల్ ఎనర్జీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుంది. అలాంటి DSPకి మరో కొత్త అర్ధం చెప్పాడు మన మెగాస్టార్ చిరంజీవి.

వివరాల్లోకి వెళితే, DSP మ్యూజికల్ షోస్ కోసం ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఇవ్వాల ఉదయం మెగాస్టార్ చేతుల మీదుగా ఈ టూర్ కి సంబందించిన టీజర్ ని రిలీజ్ చేశారు.

ఆ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ- D అంటే డెడికేషన్ అని, S- స్ట్రాటజీ, P అంటే పాపులారిటీ అని కొత్త నిర్వచనం చెప్పాడు. అలాగే తన ఖైదీ నెం 150 చిత్రంలో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటకి ఎంతగానో పేరు వచ్చిందని అలాగే ఈ పాటకి చిన్న చిన్న పిల్లలు కూడా స్పందిస్తుండడం DSP వల్లే అని తన ఆనందాన్ని పంచుకున్నాడు.

తరువాత DSP మాట్లాడుతూ- అడిగిన వెంటనే చిరంజీవి గారు వచ్చి టీజర్ విడుదల చేయడం తనకి ఆనందాన్ని ఇచ్చింది అని తన కృతజ్ఞతలు చెప్పాడు.

 

ALSO READ: DSP టూర్ టీజర్ కోసం క్లిక్ చేయండి