ENGLISH

దాసరి అరుణ్ కుమార్ రీ-ఎంట్రీ ఫిక్స్ అయిందట

19 November 2017-15:32 PM

దర్శకరత్న మరణం తరువాత పలు మీడియా ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో దాసరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రతినాయక పాత్రలు చేయడానికి సుముఖంగానే ఉన్నట్టు తెలిపాడు.

అయితే ఆ ప్రకటన తరువాత ఆయన ఏ చిత్రంలో కనిపిస్తాడో అన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ అంశానికి సంబందించే ఒక వార్త హల్చల్ చేస్తున్నది. అదేంటంటే- చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక కీలక పాత్రలో దాసరి అరుణ్ కుమార్ కనపడనున్నాడు అన్నది ఆ వార్త సారాంశం.

అయితే ఇప్పటికే అతి పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉన్న ఈ చిత్రంలో దాసరి అరుణ్ కి ఈ పాత్ర లభించనుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ వార్తని బలపరుస్తూ ఏ అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

మొత్తానికి ఈ వార్త నిజమైతే దాసరి అరుణ్ కుమార్ కి మెగా రీ-ఎంట్రీ దొరికినట్టే.

 

ALSO READ: నారా-కొణిదెల కోడళ్ళ ముచ్చట్లు