ENGLISH

ఎన్టీఆర్‌ 'బిగ్‌బాస్‌' రికార్డులు కొల్లగొట్టేదెవరు?

19 February 2018-14:44 PM

'బిగ్‌బాస్‌' సీజన్‌ 1ని ఎన్టీఆర్‌ తనదైన యాంకరింగ్‌తో సక్సెస్‌ఫుల్‌ గేమ్‌ షోగా నిలబెట్టారు. ఇప్పుడు సీజన్‌ 2 స్టార్ట్‌ అవుతోంది. ఈ సీజన్‌కి ఎన్టీఆర్‌ యాంకర్‌గా వ్యవహరిస్తారా? అందుకు అవకాశం లేదంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అయితే మరి ఆ అవకాశాన్ని బాధ్యతగా తీసుకుని నిర్వర్తించే చాకచక్యం ఉన్న హీరో ఎవరనే విషయంపై సస్పెన్స్‌ నెలకొంది. 

ఎన్టీఆర్‌ కాకుంటే ఆ షోకి వ్యాఖ్యాతగా ఎవరనేది ఊహించుకోవడం కష్టమైన ప్రక్రియే. వీకెండ్‌లో రెండు రోజులు బుల్లితెరపై కనిపించిన ఎన్టీఆర్‌ ఈ 'బిగ్‌బాస్‌' షో ద్వారా కొల్లగొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. 'బిగ్‌బాస్‌' షో టీఆర్‌పీ రేటింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలబడేందుకు కారణం ఎన్టీఆర్‌ యాంకరింగ్‌ అని చెప్పడం నిస్సందేహం. ఎన్టీఆర్‌ నటించిన 'జై లవకుశ' సినిమా షూటింగ్‌ పూనేలో జరగడం, 'బిగ్‌బాస్‌' షో కూడా పూనేలోనే జరగడం అప్పట్లో ఎన్టీఆర్‌కి బాగా కలిసొచ్చింది. 

అదంతా అలా ఉంచితే, ఎన్టీఆర్‌కి స్వతహాగా ఉన్న సెన్సాఫ్‌ హ్యూమర్‌, జీన్స్‌లో ఉన్న నట సార్వభౌమత్వం, ఆయనలోని కాస్త చిలిపితనం, అమాయకత్వం. అవసరమైన గాంభీర్యం.. ఇలా ఒక్కటేమిటి అన్నీ ఆ షోని సక్సెస్‌ స్థాయిలో నిలబెట్టేందుకు అలా ఉపయోగపడ్డాయి. మరి ఆ స్థాయిలో ఇప్పుడు బిగ్‌బాస్‌ షోని నడిపించేదెవరు? అంటే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం టాలీవుడ్‌లో. అందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు నేచురల్‌ స్టార్‌ నాని. 

ఈ మధ్యనే నాని హీరో నుండి నిర్మాతగా ప్రమోట్‌ అయ్యి, సంచలనం సృష్టించాడు. ఒకవేళ బుల్లితెరపై కనిపించే అవకాశమే వస్తే కనుక ఎన్టీఆర్‌ రేంజ్‌లో ఆకట్టుకుంటాడో లేదో. ఒకవేళ అదే జరిగితే నాని బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టించడం ఖామయే మరి. అయితే ఈ విషయంలో ఇంకా అఫీషియల్‌ క్లారిటీ రాలేదు. ఈ లిస్టులో మరికొంతమంది హీరోల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

 

ALSO READ: భానుమతి పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన అనుష్క