ENGLISH

పోర్న్‌ స్టార్‌ అయితే తప్పేంటి?

19 January 2018-08:30 AM

'నా ఇష్టంతోనే పోర్న్‌ సినిమాల్లో నటించాను. నా ఇష్టంతోనే పోర్న్‌ రంగం వీడి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అయ్యాను. అయినా నా జీవితంలో 'పోర్న్‌' అనేది గతం.. ఇప్పుడు నేనేంటి..? ' అనే విషయంపై మాత్రమే మాట్లాడండి అంటూ మీడియాకి ఘాటుగా చురకలంటించింది, పోర్న్‌ రంగం నుండి వచ్చి బాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోయిన్‌గా కొనసాగుతున్న హాట్‌ భామ సన్నీలియోన్‌. 

అయితే సన్నీలియోన్‌ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు అదే బాటలో మియా మల్కోవా ఇండియన్‌ సినిమాకి పరిచయం కాబోతోంది. రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తోన్న ఓ వీడియోలో లీడ్‌ రోల్‌ పోషిస్తోందీ పోర్న్‌ స్టార్‌ మియా మల్కోవా. ఇప్పుడు సన్నీ చెబుతున్నట్లే, ఈ హాట్‌ బ్యూటీ ఇంకెన్ని కథలు చెబుతుందో ముందు ముందు చూడాలి మరి. ఈమె స్టోరీ ఇలా ఉంటే, మరో పోర్న్‌ స్టార్‌ మియా ఖలీఫా కూడా ఇండియన్‌ సినిమాపై కన్నేసింది. త్వరలోనే ఈవిడగారు కూడా ఇండియన్‌ స్క్రీన్‌కి ఎంట్రీ ఇవ్వబోతోంది. 

అసలింతకీ ఇండియన్‌ సినిమాపై ఈ పోర్న్‌ స్టార్స్‌ 'దాడి' ఏంటి..? అని జనం ఆశ్చర్యపోతున్నారు. మన ఇండియన్‌ బ్యూటీస్‌ ఇండియన్‌ సినిమాని దాటి హాలీవుడ్‌కి వెళుతున్నారు. అలాగే అక్కడి నుండి ఇక్కడికీ వస్తున్నారేమోలే అని సరిపెట్టుకోవాలేమో. ఈ వాదననీ కొందరు కొట్టిపారేస్తుంటారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని ఎగతాళి చేస్తూ పోర్న్‌స్టార్స్‌ని ఇక్కడికి తీసుకొస్తున్నారనేది వారి ఆవేదన. అయితే ప్రపంచం మారింది. ఇంటర్నెట్‌లో పోర్న్‌ సినిమాలు విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. అదే కాకుండా పోర్న్‌ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా అడల్ట్‌ రేటెడ్‌ షార్ట్‌ ఫిలింస్‌ ఇండియాలోనే రూపొందుతున్నాయి. వీటిని నియంత్రించలేనప్పుడు పోర్న్‌స్టార్స్‌ ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై మెరిసిపోవడాన్ని తప్పుపట్టలేం. సెన్సార్‌ ఉంది, పరిధి దాటితే కత్తెరేస్తుంది. 

ఏదేమైనా ఈ పోర్న్‌ స్టార్స్‌ రాకతో భవిష్యత్తులో మన ఇండియన్‌ సినిమా అన్ని 'హద్దుల్నీ' చెరిపేసుకుంటుందేమో చూడాలి మరి.

ALSO READ: కత్తి మహేష్ ని టార్గెట్ చేసిన పూనమ్ కౌర్..!