ENGLISH

దిశా పటానీ తరగని అందాల గని

18 November 2017-18:53 PM

అబ్బా! ముద్దుగుమ్మ దిశా పటానీ అందాల దాడి తట్టుకోలేకపోతున్నామే. అమ్మడు సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌ అంటే చెప్పేందుకు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మరి. కుర్రోళ్ల మనసుల్ని తన గ్లామర్‌ దాడితో గాయం చేసేస్తోందంతే. ఎంత చూసినా తనివి తీరని అందం దిశా పటానీది. 'లోఫర్‌' సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టడంతో అమ్మడి అందానికి స్క్రీన్‌పై విలువ లేకపోయింది కానీ, ఒక్క హిట్‌ వచ్చిందంటేనా.. అమ్మడిని ఆపడం ఎవ్వరి వల్లా కాదనిపిస్తోంది. ఎంత గ్లామర్‌ షో చేసినా ఇంకా ఇంకా కొత్తగానే అనిపించే అందం దిశా పటానీ సొంతం. అందుకే ఆమె ఎన్ని ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ ఫాలో చేసినా యూత్‌కి అస్సలు బోర్‌ కొట్టదు. అంతకు మించి అన్న రేంజ్‌లోనే ఆమె వద్ద అందాల నిధి దాగుంది మరి. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్‌ అయిన 'సంఘమిత్ర'లో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.

 

ALSO READ: Qlik Here For The Gallery