ENGLISH

'ఆక్సిజన్‌' ట్రైలర్‌ వచ్చేది అప్పుడే

25 September 2017-18:46 PM

ఆరడుగుల అందగాడు గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'ఆక్సిజన్‌'. ఈ సినిమా ప్రారంభమై చాలా కాలం అయినప్పటికీ రకరకాల కారణాలతో బ్రేక్స్‌ పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది 'ఆక్సిజన్‌' మూవీ. ఇదో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ సినిమాకి 'ఆక్సిజన్‌' అనే టైటిల్‌ పెట్టడంలో ఓ ప్రత్యేకత ఉందట. అదేంటో తెరపైనే చూడాలంటున్నారు చిత్ర యూనిట్‌. రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. ఈ సినిమా ట్రైలర్‌ని విజయ దశమి నాడు విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ సన్నాహాలు చేసింది. దశమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు 'ఆక్సిజన్‌' టీజర్‌ విడుదల కానుందని చిత్ర యూనిట్‌ అఫీషియల్‌గా ప్రకటించింది. గోపీచంద్‌ కెరీర్‌లో ఇదో స్పెషల్‌ మూవీ కానుందట. 'జిల్‌', సౌఖ్యం మూవీస్‌తో వరుస సక్సెస్‌లు అందుకున్నాడు గోపీచంద్‌. కానీ ఆ తర్వాత మన హీరోకి టైం అంతగా కలిసి రావడం లేదు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన 'గౌతమ్‌నందా' కూడా నిరాశపరిచింది. సంపత్‌ నంది దర్శకత్వంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో గోపీచంద్‌ ఆశలన్నీ 'ఆక్సిజన్‌'పైనే. ఈ సినిమా అయినాగోపీచంద్‌కి అవసరమైన ఆక్సిజన్‌ని అందిస్తుందో లేదో చూడాలిక.

ALSO READ: జై లవకుశ నాలుగు రోజుల కలెక్షన్స్