ENGLISH

గోపీచంద్‌ 'బుల్లెట్‌' దూసుకొస్తోంది

22 April 2017-18:35 PM

ఆరడుగుల అందగాడు యాక్షన్‌ హీరో గోపీచంద్‌ చేతిలో చాలా సినిమాలున్నాయి. మే నెలలో గోపీచంద్‌ నటించిన సినిమా ఒకటి రిలీజ్‌ చేయడానికి చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. బి.గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ముద్దుగుమ్మ నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఇది. పక్కా మాస్‌ మూవీ ఇది. యాక్షన్‌ సీక్వెల్స్‌ ఈ సినిమాలో అదరిపోయేలా ఉండనున్నాయట. డైరెక్టర్‌ బి.గోపాల్‌ ఎన్నో సంచలన విజయాల్ని తెలుగు తెరకు అందించారు. అగ్రహీరోలైన బాలకృష్ణ, చిరంజీవిలతో ఇండస్ట్రీ హిట్స్‌ కొట్టిన ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌. మళ్ళీ డైరెక్షన్‌లో మునుపటి సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాడు. గోపీచంద్‌ నటిస్తోన్న ఆక్సిజన్‌ సినిమా రిలీజ్‌కి లైన్‌లో వుంది. ఈ సినిమాలో రాశి ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో సినిమా 'గౌతమ్‌ నందా' శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. యాక్షన్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హన్సిక, కేథరీన్‌ కథానాయికలు. ఈ సినిమాకి 'ఆరడుగుల బుల్లెట్టు..' అనే టైటిల్‌ని కన్‌ఫామ్‌ చేశారు. ఇది పవన్‌కళ్యాణ్‌ సినిమా 'అత్తారింటికి దారేది'లోని పాట. అదే సినిమాలో పవన్‌కళ్యాణ్‌ పేరు 'గౌతమ్‌ నందా'. ఇంతవరకూ పవన్‌ని వాడుకుంటున్న వారి లిస్టులో తాజాగా గోపీచంద్‌ కూడా చేరిపోయాడు. మరి పవన్‌ టైటిల్స్‌ గోపీచంద్‌కి కలిసొస్తాయేమో చూడాలిక.

ALSO READ: 'రేపల్లె'లో చరణ్‌, సమంత