ENGLISH

ఇక్కడ యంగ్‌ టైగర్‌ ఆక్కడ ఇళయదళపతి

22 September 2017-18:19 PM

తమిళ హీరో విజయ్‌ త్రిపాత్రాభినయంలో తెరకెక్కుతోన్న సినిమా 'అదిరింది'. తమిళంలో 'మెర్సల్‌'. అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా దర్శకుడు అట్లీ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే ప్రపంచ రికార్డుల్ని నమోదు చేసింది. యూట్యూబ్‌లో 6,95000 మంది లైక్‌ చేశారు ఈ టీజర్‌ని. అజిత్‌ హీరోగా వచ్చిన 'వివేగం' ఇంతవరకూ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. 5,99,000 లైక్స్‌ రాగా, ఇంతవరకూ మొదటి స్థానంలో ఉన్న హాలీవుడ్‌ మూవీ 'స్టార్‌ వార్‌ - ది లాస్ట్‌ ఆఫ్‌ జేడీ'ని బీట్‌ చేసింది. లేటెస్టుగా ఆ రికార్డుని విజయ్‌ 'అదిరింది' సినిమా బీట్‌ చేసేసింది. మూడు రోజుల్లో అజిత్‌ వివేగం ఈ రికార్డుని సాధించగా, కేవలం 24 గంటల్లోనే విజయ్‌ 'మెర్సల్‌' ఆ స్థానాన్ని దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో విజయ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. తెలుగులో తాజాగా విడుదలైన ఎన్టీఆర్‌ సినిమా 'జై లవకుశ' కూడా త్రిపాత్రాభినయంతో తెరకెక్కి, రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. విజయ్‌ సినిమాలకి తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. గతంలో 'తుపాకి' తదితర చిత్రాలు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. అలాగే ఈ సినిమా కూడా తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదల చేస్తున్నారు. కాజల్‌, నిత్యామీనన్‌, సమంత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ALSO READ: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో హీరో అరెస్ట్‌