ENGLISH

చార్మీకి షాక్ ఇచ్చిన హైకోర్టు

25 July 2017-15:59 PM

SIT విచారణ జరిగే తీరుపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుని ఆశ్రయించిన చార్మీకి చుక్కెదురయింది.

ఆమె కోరుకున్నటుగా ఒక ప్రత్యేఖ న్యాయవాదిని ఆమెతో పాటుగా విచారణ కి అనుమతించేది లేదు అని హైకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే ఆమె విచారణ సమయంలో అక్కడ మహిళా అధికారులు కూడా ఉండాలి అని సూచించింది అలాగే ఆమె అనుమతితోనే బ్లడ్ శాంపిల్స్ కాని వెంట్రుకలు, గోళ్ళకి సంబంధించిన శాంపిల్స్ తీసుకోవాలని తీర్పు వెల్లడించింది.

అయితే Excise Enforcement  తరపున న్యాయవాది కోర్టు వారికి తమ వాదన వినిపిస్తూ- తాము ఇప్పటివరకు ఎవ్వరి దగ్గర నుండి బలవంతంగా బ్లడ్, వెంట్రుకలు, గోళ్ళు శాంపిల్స్ గా తీసుకోలేదని, సుప్రీమ్ కోర్టు గైడ్ లైన్స్ నే పాటిస్తున్నట్టు తెలిపారు.

ఇక విచారణ సమయం కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకే కొనసాగించాలి అని హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది.

ALSO READ: డ్రగ్స్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు: కాజల్ అగర్వాల్