ENGLISH

'రాజుగారి గది' కి సందడి వచ్చేసిందోచ్‌!

13 October 2017-11:57 AM

కుమారి సమంత శ్రీమతిగా మారిన తర్వాత వస్తోన్న తొలి సినిమా 'రాజుగారి గది - 2'. ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో నటిస్తోంది. సమంత లాయర్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. ఇదో హారర్‌ కామెడీ చిత్రం. సమంత ఓ దెయ్యం అని ట్రైలర్‌ ద్వారా తెలిసిపోయింది. అలాగే ఓ పోస్టర్‌ ద్వారా పంతులమ్మ గెటప్‌లోనూ కనిపించింది సమంత. అయితే తనది లాయర్‌ పాత్రట ఈ సినిమాలో. చాలా ఎమోషనల్‌గా ఉంటుందట ఈ క్యారెక్టర్‌. ఒక సందర్భంలో గ్లిసరిన్‌ లేకుండానే ఏడ్చేసిందట సమంత. అంత బాగా ఆ సన్నివేశం సమంతకు కనెక్ట్‌ అయ్యిందట. అలాగే చూసే ప్రేక్షకులకు కూడా ఆ పెయిన్‌నీ ఫీలవుతారంటోంది ముద్దుగుమ్మ సమంత. పెయిన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌నీ మిస్‌ చేయదట. బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్‌ సమంత ద్వారా పండుతుందట. సోషల్‌ మీడియాలో 'సుచీ లీక్స్‌' పేరిట ఈ మధ్య పెద్ద దుమారమే లేచింది. ఆ ఇష్యూకి సంబంధించి ఈ సినిమాలో కీలక ప్రస్థావన ఉందట. ఈ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున మెంటలిస్ట్‌ పాత్రలో నటిస్తున్నాడు. అక్కినేని వారింట కోడలిగా అడుగు పెట్టాక, ప్రేక్షకుల ముందుకు వస్తోన్న మామా - కోడలు కలిసి నటించిన తొలి సినిమా ఇది. అందుకే అక్కినేని ఫ్యామిలీకే ఈ సినిమా సో స్పెషల్‌. అలాగే అక్కినేని అభిమానులకు కూడా. ఓంకార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ధియేటర్స్‌ వద్ద కోలాహలం మామూలుగా లేదు. ఇంతవరకూ సమంతను గ్లామరస్‌ పాత్రల్లో హీరోయిన్‌గా చూసేశాం. ఇక దెయ్యం పాత్రలో సమంత ఎలా ఉండబోతోందా? అంటూ ఆమె అభిమానులు ధియేటర్స్‌ వద్ద క్యూ కట్టారు. అశ్విన్‌ బాబు, వెన్నెల కిషోర్‌, ప్రదీప్‌, షకలక శంకర్‌ తదితరులు ఈ సినిమాలో నటించారు.

ALSO READ: DSP-మహేష్ లు ఫిక్స్ అయ్యారు...