ENGLISH

వదంతుల పై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్

17 July 2017-14:39 PM

జబర్దస్త్ కామెడీ షోతో లైమ్ లైట్ లోకి వచ్చిన కమెడియన్ - హైపర్ ఆది.

రెండు, మూడు రోజులనుండి హైపర్ ఆదికి పెళ్ళి జరిగందంటూ ఒక ఫోటో అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నది. దీనిని చూసి, అందరూ హైపర్ ఆది ఎవరికీ తెలియకుండా పెళ్ళి చేసేసుకున్నాడు అంటూ వార్తలు వచ్చేసాయి.

అయితే ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, ఈ ఫోటో తాను నటిస్తున్న చిత్రంలో ఒక పెళ్ళికి సంబంధించిన షాట్ అని చెప్పాడు. ఆ షూటింగ్ జరిగినప్పుడు తీసిన ఈ ఫోటో లీక్ జరిగి ఇప్పుడు ఒక పెద్ద న్యూస్ అయిందంటూ తెలిపాడు.

తన పెళ్ళికి ఇంకా టైం ఉందంటూ, అందరికీ చెప్పి మరీ పెళ్ళి చేసుకుంటానని ముగించాడు.

ALSO READ: టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు: ఓ బ‌డా హీరో గ‌జ‌గ‌జ‌?